వైరస్ నుంచి కోలుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి.. తనకు మరో జన్మ ఇచ్చిన వైద్యురాలితో పాటు సిబ్బందిని వదిలి వెళ్లాలంటే.. ఆ తల్లికి గుండె భారంగా అనిపించింది. గుజరాత్ సూరత్‌కు చెందిన లతాబెన్ కొవిడ్ బారిన పడి సూరత్‌లోని మోదీ ఐసోలేషన్ సెంటర్లో చేరారు. లతాబెన్కు అన్నీ తామై వైద్య సిబ్బంది.. ఆమెను కంటికిరెప్పలా చూసుకున్నారు. సమయానికి వైద్య సేవలు అందిస్తూ.. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యాన్ని సమీక్షించారు.
తల్లి కంటే మిన్నగా..
వైద్యుల సహాయంతో మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న లతాబెన్కు వారిని వదిలి ఇంటికి వెళ్లాలనిపించలేదు. తనను కన్నతల్లి కంటే మిన్నగా చూసుకున్న వైద్యురాలిని, సిబ్బందిని వదిలి వెళ్లనని చెప్తుంటే.. అక్కడున్నవారికి ఆనందబాష్పాలు వచ్చాయి.