కేరళ పౌల్ట్రీలో ఓ కోడి పెట్టిన గుడ్డు ఆకారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మలప్పురంలోని ఏలంకుళంకు చెందిన ప్రభాకరన్ కోళ్లఫామ్ నడుపుతున్నాడు. అందులో పెరుగుతున్న ఓ కోడి ఆశ్చర్యకరంగా.. హృదయాకారంలో గుడ్డు పెట్టింది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివెళ్తున్నారు.
హృదయాకార గుడ్డు పెట్టిన నల్లకోడి - కేరళ వార్తలు ఆన్లైన్
కేరళలో ఓ కోడి హృదయాకారంలో గుడ్డుపెట్టింది. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఈ గుడ్డును హృదయానికి హత్తుకుంటారు
కేఎస్ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగిగా ఉన్న.. ప్రభాకరన్ రెండేళ్ల క్రితం ఈ పౌల్ట్రీని ప్రారంభించినట్లు తెలిపారు. పుష్కలమైన ఔషధ గుణాలతో పాటు.. రుచికరమైన ఈ నల్లకోడి పెంపకంతో లాభాలు ఆర్జిస్తున్నట్లు వివరించాడు.
ఇవీ చదవండి:రంగుల గుడ్డు అదిరింది.. ఇక పిల్లలకు తినిపించేయండి!