Hearing on Chandrababu Bail Petition in Skill Case:స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సీఐడీ తరఫున అదనపు ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపిస్తూ.. ఎన్నికలకు ముందు కావాలనే కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు.
బెయిల్‌పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ కేసు 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని వ్యాఖ్యానించారు. సీమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్ అంతా వెరిఫై చేయలేదని రాశారు.. ఈ ఫోరెన్సిక్ రిపోర్టు చంద్రబాబును ఇరికించడం కోసమే తయారు చేశారని అన్నారు. ఈ కేసులో ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసిన వారే రిపోర్టులో చెప్పారని లూథ్రా వాదించారు.
అప్పటివరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దు - దీపావళి తర్వాత 'స్కిల్ కేసు'పై తీర్పు : సుప్రీంకోర్టు
ఈ కేసులో ముందుగా చంద్రబాబు విజయవాడ ఏసీబీ కోర్టులో (Vijayawada ACB Court) బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేయడంతో.. హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు అనారోగ్య కారణాల కారణంగా హైకోర్టు అక్టోబరు 31న మధ్యంతర బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ మధ్యంతర బెయిలు పిటిషన్‌తో పాటు ప్రధాన బెయిలు పిటిషన్‌పై చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు.