కరోనా రోగుల్లో భయాన్ని తొలగించడానికి కొందరు వైద్య సిబ్బంది పాటలు పాడటం, నృత్యాలు చేసిన సన్నివేశాలను మనం చూశాం. అయితే ఒడిశా గంజాం జిల్లా బ్రహ్మాపుర్ నగరంలోని ఎంకేసీజీ వైద్య కళాశాల ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది.. కొవిడ్ రోగులకు చికిత్స అందించడమే కాకుండా.. వారి వ్యక్తిగత పనులు చేస్తున్నారు.
కరోనా రోగులకు కటింగ్, షేవింగ్- ఆ ఆస్పత్రిలో సేవలు భేష్ - ఒడిశా వైద్య సిబ్బంది
ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది.. కరోనా బాధితుల వ్యక్తిగత పనులు చేస్తూ.. ప్రశంసలు అందుకుంటున్నారు. జుట్టు కత్తిరించడం సహా షేవింగ్ సైతం చేస్తున్నారు.

కరోనా బాధితులు
తలకు నూనె రాయడం దగ్గర నుంచి.. పురుషులకు క్షౌరం సహా గడ్డాలు గీయడం వరకు అన్ని పనులు చేస్తున్నారు. దీంతో వైద్య సిబ్బందిపై నెటిజన్లు సహా పలువురు అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.