Health Secretary EC meet: వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌తో ఎన్నికల అధికారులు ఇవాళ(డిసెంబర్ 27) భేటీ కానున్నారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్ పరిస్థితి, ఒమిక్రాన్ వ్యాప్తిపై ఎన్నికల కమిషన్‌కు రాజేశ్ భూషణ్ సూచనలు చేయనున్నట్లు సమాచారం.
గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ శాసనసభల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో పూర్తికానుండగా.. మేలో ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. మరోవైపు.. ఎన్నికల తేదీలను వచ్చే నెలలో ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.
కొవిడ్ మూడో ఉద్ధృతి భయాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ఒకట్రెండు నెలలు వాయిదావేయాలని, అన్ని ఎన్నికల ర్యాలీలను నిషేధించాలని.. యూపీ ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్నిఅలహాబాద్ హైకోర్టు గురువారం కోరింది. దీంతో ఎన్నికల సంసిద్ధతను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల కమిషనర్ మంగళవారం ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసీ ఇప్పటికే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో పర్యటించింది.
ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి..