తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొవిడ్ టీకా పంపిణీ కోసం 'కమ్యూనికేషన్​ స్ట్రాటజీ' - కరోనా వ్యాక్సిన్​ పంపిణీ

దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు వ్యాక్సిన్​ పట్ల భయాలను తొలగించేలా కచ్చితమైన, పారదర్శకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు కమ్యూనికేషన్​ స్ట్రాటజీని విడుదల చేసింది.

Communication strategy
కమ్యూనికేషన్​ స్ట్రాటజీ

By

Published : Dec 31, 2020, 7:09 PM IST

దేశంలో కొవిడ్​-19 టీకా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో పంపిణీపై దృష్టి సారించింది కేంద్రం. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలని ఆదేశించిన కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ.. తాజాగా 'కమ్యూనికేషన్​ స్ట్రాటజీ'ని విడుదల చేసింది. టీకాపై ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించటం, వ్యాక్సిన్​ తీసుకునేందుకు అంగీకారం తెలిపేలా చేసేందుకు కచ్చితమైన, పారదర్శక సమాచారాన్ని క్షేత్రస్థాయిలో చేరవేయటమే దీని ముఖ్య ఉద్దేశం.

ఈ మేరకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమ్యూనికేషన్​ కార్యకలాపాలకు మార్గనిర్దేశం చేసేలా 88 పేజీల డాక్యుమెంట్​ను విడుదల చేసింది ఆరోగ్య శాఖ.

డాక్యుమెంట్​ ప్రకారం.. వ్యాక్సిన్​ పట్ల ప్రజల్లో నెలకొన్న నిరాశను తొలగించటం సహా, టీకా భద్రత, సమర్థత పట్ల నెలకొన్న భయాలతో తలెత్తే సందేహాలను నివృత్తి చేయటం ఈ వ్యూహం లక్ష్యం. అలాగే టీకా ద్వారా ఎదురయ్యే రిస్క్​లపై సమాచారం అందించటం, వ్యాక్సిన్​ పంపిణీ సమయంలో తలెత్తే అనుకోని ఘటనల పట్ల అప్రమత్తంగా ఉండటం వంటివి కీలక అంశాలుగా ఉన్నాయి.

" కమ్యూనికేషన్​లో పారదర్శకతతో కొవిడ్​-19 వ్యాక్సిన్​ పట్ల ప్రజల్లో నమ్మకం, విశ్వాసాన్ని పెంపొందించాలనేది ఈ వ్యూహం సూచిస్తోంది. అలాగే.. తప్పుడు సమాచారం, పుకార్ల వ్యాప్తిపైనా దృష్టి సారించనుంది. "

- కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ

ఈ లక్ష్యాన్ని మూడు పద్ధతుల్లో సాధించాలని యోచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ.

  • మొదటి దాంట్లో.. వ్యాక్సిన్​ పంపిణీ ఎప్పుడు, ఎలా, ఎవరికి, సమయం, తేదీ వంటి వివరాలపై నిపుణులు, అధికారులతో అవగాహన కల్పించటం, వ్యాక్సిన్ల భద్రత, సామర్థ్యాన్ని నొక్కి చెప్పటం, దశలవారీగా డ్రైవ్​ నిర్వహించే నిర్ణయాన్ని వివరించటం వంటివి ఉన్నాయి.
  • రెండోది.. రియల్​ టైంలో స్పందించేందుకు నేషనల్​ మీడియా రాపిడ్​ రెస్పాన్స్​ సెల్​ (ఎన్​ఎంఆర్​ఆర్​సీ)ను ఏర్పాటు చేయటం.
  • మూడోది.. కమ్యూనిటీ మొబిలైజర్స్​, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​ను భాగస్వామ్యులుగా చేసి కమ్యూనిటీ సంప్రదింపులు, మతపరమైన, యువజన సమావేశాలు, పౌర సమాజ సంస్థలు, ఎస్​హెచ్​జీలు, పంచాయతీలు, ఇతర కమ్యూనిటీ సంబంధిత ఫ్లాట్​ఫాంల ద్వారా సమాచారాన్ని చేరవేయటం.

ఇదీ చూడండి:'కొత్త ఏడాదిలో కొవిడ్​ టీకాపై శుభవార్త'

ABOUT THE AUTHOR

...view details