Health Ministry On Covid: దేశంలో రోజువారీ కొవిడ్-19 కేసులు 10వేలకుపైగా నమోదవడంపై కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 8 జిల్లాల్లో కరోనా వారాంతపు పాజిటివిటీ రేటు 10శాతం కంటే అధికంగా నమోదవుతోందని, మరో 14 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉందని పేర్కొంది.
Health Ministry On Covid: దేశంలో 33రోజుల తర్వాత కొవిడ్-19 రోజువారీ కేసుల సంఖ్య 10వేలకు పైగా నమోదైందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
"వారాంతపు కొవిడ్-19 కేసులు, పాజిటివిటీ రేటు ప్రకారం మహారాష్ట్ర, బంగాల్, తమిళనాడు, దిల్లీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో ఆందోళనకర స్థాయిలో మహమ్మారి వ్యాప్తి చెందుతోంది. 8 జిల్లాల్లో కొవిడ్-19 వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కంటే అధికంగా నమోదవుతోంది. మరో 14 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5-10శాతం ఉంది. డెల్టా వేరియంట్ కంటే రెట్టింపు వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ ఇదివరకే తెలిపింది."
-- కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ
కొవిడ్-19 సోకిన తర్వాత బాధితుల్లో రోగనిరోధక శక్తి 9నెలల పాటు ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపినట్లు కేంద్ర వైద్యశాఖ వివరించింది. దేశంలో కేసులు పెరుగుతున్నందు వల్ల క్షేత్రస్థాయిలో దృష్టిసారించాల్సి ఉందని పేర్కొంది.
హిమాచల్ ప్రదేశ్‌లో అధిక సంఖ్యలో పర్యటకులు 90శాతం మందికి వ్యాక్సినేషన్..
Vaccination In India: భారత్‌లోని వయోజనుల్లో 90శాతం మందికి కొవిడ్-19 టీకా మొదటి డోసు పూర్తయిందని, దేశ జనాభాలో 63.5శాతం మందికి రెండు డోసులు అందిచినట్లు కేంద్రం వెల్లడించింది.
ముందుజాగ్రత్త డోసు ప్రాథమికంగా.. వ్యాధి తీవ్రతను, మరణాల రేటును తగ్గించేందుకేనని పేర్కొంది. వ్యాక్సినేషన్‌కు ముందు, తర్వాత కూడా మాస్కు ధరించాలని సూచించింది.
ఒక్కనెలలోనే..
Omicron Cases In World: ఒక్కనెలలోనే ప్రపంచవ్యాప్తంగా 121 దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ చుట్టేసిందని కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారిన పడి 59మంది మృతిచెందగా, మొత్తం 3,30,379 మందికి ఒమిక్రాన్ సోకినట్లు వివరించింది.
ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు..
Centre Letter To States On Covid-19: కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన 8 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు(దిల్లీ, హరియాణా, తమిళనాడు, బంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఝార్ఖండ్) కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ లేఖ రాసింది. కొవిడ్-19 పరీక్షలు, చికిత్స, ఐసీయూ పడకలు, కొవిడ్ వ్యాక్సినేషన్, క్వారంటైన్.. తదితర వాటిపై దృష్టిసారించాలని సూచించింది.
శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని లేఖలో పేర్కొన్నారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్. ఆయా రాష్ట్రాల్లో ఒక్కసారిగా కేసులు పెరగడానికి గల కారణాలను విశ్లేషించుకుని.. తగిన చర్యలు చేపట్టాలని లేఖలో ఉంది.
వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటైన్మైంట్, బఫర్ జోన్లుగా ప్రకటించి.. వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించింది కేంద్రం.
States Covid 19 Restrictions:
వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు ఇలా..
- మహారాష్ట్రలో ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 2022, జనవరి 7వరకు రాష్ట్రంలో సెక్షన్ 144ను విధించింది. ఇప్పటికే హోటల్స్, పబ్స్, రెస్టారెంట్లు, రిసార్ట్లు, క్లబ్స్‌లో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశారు పోలీసులు.
- గోవాలో రాత్రి కర్ఫ్యూ లేనప్పటికీ.. ప్రపంచ దేశాల నుంచి గోవాకు వచ్చే పర్యటకులకు ఆంక్షలు విధించింది రాష్ట్ర సర్కార్. అంతర్జాతీయ ప్రయాణికులకు విమానాశ్రయంలో కొవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తామని గోవా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ట్విట్టర్లో పేర్కొన్నారు.
- మరోవైపు డిసెంబరు 31 న వేడుకలు చేసుకునే గోవా వాసులు కచ్చితంగా కొవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది రాష్ట్ర సర్కార్.
- కొవిడ్-19, ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. డిసెంబర్ 31న పుదుచ్చేరిలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, థియేటర్లలో కేవలం కొవిడ్-19 టీకా రెండు డోసులు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వాలని హెల్త్ డైరెక్టర్ జీ శ్రీరాములు ఆదేశాలు జారీ చేశారు.
- హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటకులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది అక్కడి ప్రభుత్వం.
ఇదీ చూడండి:ఆ నగరాల్లో ఆందోళనకరంగా కరోనా 'ఆర్-వ్యాల్యూ'