తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బూస్టర్​ డోస్​, పిల్లలకు వ్యాక్సిన్​పై నిర్ణయం అప్పుడే: కేంద్రం - Covid vaccination

booster dose in India: దేశంలో బూస్టర్​ డోస్​, చిన్న పిల్లలకు కరోనా టీకాల పంపిణీపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా.

Health Minister Mansukh Mandaviya
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా

By

Published : Dec 3, 2021, 8:02 PM IST

booster dose in India: దేశంలో ఒమిక్రాన్​ భయాల నేపథ్యంలో బూస్టర్​ డోస్​ ప్రారంభించాలనే డిమాండ్లు పెరిగిన క్రమంలో పార్లమెంట్​ వేదికగా స్పష్టతనిచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్​సుఖ్​ మాండవియా. బూస్టర్​ డోస్​, పిల్లలకు కొవిడ్​ టీకాపై నిపుణుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

లోక్​సభలో కొవిడ్​-19పై జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా ఈ విషయంపై వివరణ ఇచ్చారు మాండవియా. ఎట్​ రిస్క్​ దేశాల నుంచి వచ్చిన 16000 మంది ప్రయాణికులకు ఆర్​టీపీసీఆర్​ పరీక్షలు నిర్వహించామని, అందులో 18 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలినట్లు వెల్లడించారు. వారి స్వాబ్​ సాంపిల్స్​ను జీనోమ్​ సీక్వెన్సింగ్​ కోసం పంపించామన్నారు.

పీఎం కేర్స్​ నిధుల ద్వారా సమకూర్చిన వెంటిలేటర్లపై విపక్షాలు విమర్శలు చేయటాన్ని తప్పుపట్టారు మాండవియా. సంక్షోభ సమయంలో ప్రధాని మోదీ నాయకత్వం గొప్పగా ఉందని కొనియాడారు.

" 58వేల వెంటిలేటర్ల కోసం ఆడర్లు ఇచ్చాం. అందులో చాలావరకు ప్రభుత్వ రంగ సంస్థలవే ఉన్నాయి. ఇప్పటి వరకు 50,200 శ్వాస సంబంధింత యంత్రాలను రాష్ట్రాలకు సరఫరా చేశాం. వివిధ ఆసుపత్రుల్లో 48వేల యంత్రాలు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రాలకు అవసరమైన ఔషధాలను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రభుత్వానికి సహకరిస్తామని విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు హామీ ఇచ్చాయి. కానీ, ఆ మాటలను వెనక్కి తీసుకుని, కొవిడ్​-19పై దేశం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు."

- మాన్​సుఖ్​ మాండవియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.

దేశంలోని అర్హులైన ప్రజలందరికీ పూర్తిస్థాయిలో టీకా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు మాండవియా. ఇప్పటికే 85శాతం మంది లబ్ధిదారులు తొలిడోసు, 50 శాతం మంది పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేసేందుకు తమ నియోజకవర్గాల్లో 100 శాతం పూర్తయేందుకు కృషి చేయాలని లోక్​సభ సభ్యులకు సవాల్​ చేశారు. ఇప్పటికే రాష్ట్రాల వద్ద 22 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈ నెలలో మరో 10 కోట్ల డోసులను అందించనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:'ఆక్సిజన్​ కొరతపై విపక్షాలు రాజకీయాలు మానుకోవాలి'

భారత్​లో బూస్టర్​ డోస్​కు శాస్త్రవేత్తల సిఫార్సు- వారికే ముందు!

ABOUT THE AUTHOR

...view details