Headmaster kiss student: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ముద్దు పెట్టుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన హెడ్మాస్టర్పై సస్పెన్షన్ వేటు వేశారు ఉన్నతాధికారులు. ఈ సంఘటన కర్ణాటక, మైసూర్ జిల్లాలోని హెచ్.డి.కోటే తాలుకాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరిగింది.
ఇదీ జరిగింది..
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఎం.అనిల్‌కుమార్.. విద్యార్థినిని తన ఛాంబర్లోకి తీసుకెళ్లి ముద్దు పెడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండగా.. మిగిలిన విద్యార్థులు కిటికీలోంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
వీడియో ఉన్నతాధికారులకు చేరిన క్రమంలో హెడ్మాస్టర్పై చర్యలకు ఉపక్రమించారు. పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ అత్యవసరంగా భేటీ అయి.. సస్పెన్షన్ వేటు వేశారు.