తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాఠాలు చెబుతూ... క్లాస్​రూంలో గుండెపోటుతో కుప్పకూలిన ప్రధానోపాధ్యాయుడు

Headmaster dies in classroom: అప్పటివరకు అల్లరికేరింతలతో సందడిగా ఉన్న పాఠశాలలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న హెడ్​మాస్టర్ కుర్చిలోనే గుండెపోటుతో.. ఒరిగిపోయాడు. సార్.. చెప్పే పాఠం కోసం ఎదురు చూస్తున్న ఆ విద్యార్దులు, ఒక్కసారిగా ఖిన్నులైయ్యారు. ఒక్కపరుగున పక్కక్లాస్ కు వెళ్లి.. సహ ఉపాధ్యాయులను పిలుచుకొచ్చారు. కాని అప్పటికే, పరిస్థితి చేయి దాటింది. పాఠశాలకు పెద్ద దిక్కైన ప్రధానోపాధ్యాయుడి ప్రాణం అనంత వాయుువుల్లో కలసిపోయింది. ఏళ్లుగా కుర్చిలో కూర్చుని పాఠాలు చెప్పే ఆ మాస్టారు.. ఆ కుర్చిలోనే ప్రాణాలు వదిలిన విషాద ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.

Headmaster dies in classroom
Headmaster dies in classroom

By

Published : Mar 4, 2023, 4:50 PM IST

Headmaster dies in classroom: ఇటీవల కాలంలో గుండెపోటు పరిపాటిగా మారింది. అప్పటివరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నవారు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి, నా అనుకున్నవారిని అనాథలు చేసి ప్రాణాలువదులుతున్నారు. ఇలాంటి ఘటనలు వార్త, సామాజిక మాధ్యమాల్లో చూడటం పరిపాటిగా మారింది. కాని ఉదయాన్నే ఆ పాఠశాలకు వచ్చి, పెద్దదిక్కుగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు.. పాఠాలు చెబుతూ, ఒక్కసారిగా కూర్చున్న కుర్చిలో గుండెపోటుతో ప్రాణాలు వదలడం.. ఆ పాఠశాల విద్యార్దులు జీర్ణించుకోలేకపోతున్నారు.. రోజులాగే పాఠశాలకు వచ్చి, సహ ఉపాధ్యాయులు, సిబ్బందికి తగిన సూచనలు చేసి.. తన విధుల్లోకి దిగిన ప్రధానోపాధ్యాయుడు తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలిన ఘటన బాపట్ల జిల్లా విషాదాన్ని నింపింది. తమ కన్నుల ముందే ఉపాధ్యాయుడు మృతి చెందటంతో విద్యార్థులు కన్నీరు మన్నీరుగా విలపిస్తున్నారు.

బాపట్లజిల్లా వేటపాలెం మండలం వాకావారి పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఈ ఘటనలో.. హెడ్​మాస్టర్​ను బ్రతికించుకునేందుకు సహఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బాపట్ల జిల్లా జె.పంగులూరుకు చెందినపాలపర్తి వెర్రిబాబు (45) మృతిలో.. టీచర్లు ఒక్కసారిగా శోకవదనంలోకి వెళ్లిపోయారు. రోజువారిగా అందరితో కలసి సరదగా ఉండే మాస్టారు.. విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకోవడం.. అంతా క్షణాల్లో జరిగిపోయిందని తోటీ ఉపాధ్యాయులు వాపోతున్నారు.

ప్రధానోపాధ్యాయుడు పడిపోవడం గమనించిన విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందజేశారు. ఉపాధ్యాయున్ని పరిశీలంచిన వైద్య సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని మృతిని కళ్లారా చూసిన విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ... తమ ఉపాధ్యాయుని కోల్పోయామంటూ కన్నీటి పర్యంతరమయ్యారు. రోజు కూర్చొని పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు అదే కుర్చీలో ప్రాణాలు విడవడంతో తోటి ఉపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు... వేటపాలెం మండల విద్యాశాఖాధికారి వచ్చి పరిశీలించారు... మృతుని కుటుంబానికి సమాచారం అందించారు.

'ఈరోజు మేము అంతా 8:30కి వచ్చాం. సార్​కు కాస్త ఆరోగ్యం బాగా లేదన్నారు. నేను అటు వైపు వెళ్లాను కొంత సేపటి తరువాత స్కూల్ పిల్లలు నా వద్దకు వచ్చారు. విషయం తెలుసుకోగా.. పిల్లలు మాస్టార్ కింద పడిపోయారు అని తెలిపారు.నేను అక్కడికి వెళ్లేలోగా సార్ అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నేను సీపీఆర్ చేశాను. ఆలోగా చుట్టు పక్కల వారు వచ్చారు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.'- భూలక్ష్మి, ఏ.ఎన్.ఎం.

'వాకావారిపాలెంలో గత కొంత కాలంగా పాలకుర్తి వెర్రిబాబు ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. తన తరగతి గదిలో గుండెపోటుతో రావడంతో విద్యార్థులు ఆరోగ్య కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె సహాయం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది'-. నిరంజన్, ఎం.ఈ.ఓ.

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details