ఒడిశా సంబల్పుర్లోని బుర్లా ఆస్పత్రి వద్ద రోడ్డుపై శిరస్సు లేకుండా ఓ చిన్నారి మృతదేహం పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ఆస్పత్రిలో మృతి చెందిన చిన్నారిని సిబ్బందే డంపింగ్ యార్డులో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై శిరస్సు లేని పసికందు మృతదేహం - burla hospital odisha
ఒడిశాలోని సంబల్పుర్లో అమానవీయ ఘటన జరిగింది. స్థానిక బుర్లా ఆస్పత్రి వద్ద శిరస్సులేని ఓ పసికందు మృతదేహం పడి ఉంది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఒడిశాలో దుర్ఘటన.. పసికందును రోడ్డు మీద..
ఒడిశాలో అమానవీయ ఘటన
అయితే ఈ ఘటనపై స్పందించిన ఆస్పత్రి యాజమాన్యం.. బుధవారం ఎలాంటి శిశు మరణాలు నమోదు కాలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చదవండి :దురుద్దేశంతో ఎర్రకోటకు వెళ్లలేదు: దీప్సిద్ధూ