కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతా దళ్ సెక్యూలర్(జేడీఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
"నాకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. లక్షణాలు ఏమైనా ఉంటే స్వతహాగా ఐసోలేషన్‌లోకి వెళ్లండి."
- హెచ్‌డీ కుమారస్వామి, కర్ణాటక మాజీ సీఎం