తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కర్ణాటకలోనూ ఓ అజిత్​ పవార్​ పుట్టుకురావచ్చు.. 5 నెలల్లో భారీ మార్పులు!' - మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం

కర్ణాటకలోనూ ఓ అజిత్​ పవార్​ పుట్టుకొస్తారని జేడీఎస్​ కీలక నేత హెచ్​డీ కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అజిత్​ పవార్​ మద్దతు తెలిపిన నేపథ్యంలో.. కర్ణాటకలోనూ ఏం జరుగుతుందోనని తాను భయపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

hd-kumaraswamy-said-ajit-pawar-will-be-emerge-in-karnataka-like-maharashtra-crisis
హెచ్‌డీ కుమారస్వామి కర్ణాటక

By

Published : Jul 4, 2023, 7:45 AM IST

HD Kumaraswamy Karnataka : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్​ అగ్ర నేత.. హెచ్​డీ కుమార స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోనూ ఓ అజిత్​ పవార్​ పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే కొద్ది రోజుల్లో ఈ పరిణామం జరగొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం కర్ణాటక విధానసభలోని జేడీఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కుమార స్వామి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

"మహారాష్ట్రలో శరద్​ పవార్​కు అజిత్​ పవార్​ టోపి పెడతారని ఎవరైనా అనుకున్నారా? మహారాష్ట్రలో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఎవ్వరూ ఊహించలేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. బీజేపీకి అజిత్​ పవార్​ మద్దతు ప్రకటించారు. ఇక కర్ణాటకలోనూ ఏం జరుగుతుందోనని నేను భయపడుతున్నాను" అని ప్రస్తుత రాజకీయాలపై కుమార స్వామి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అజిత్​ పవార్​ ఎన్​సీపీని చీల్చి, మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరి.. ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నేపథ్యంలో.. కుమార స్వామి చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో చర్చనీయాంశంగా మారాయి.

నవంబర్​లో కర్ణాటక రాజకీయాల్లో మార్పు వస్తుందని చాలా రోజుల నుంచి అక్కడి కొంతమంది నేతలు చెబుతూ వస్తున్నారు. దీనిపై స్పందించిన కుమార స్వామి.. బీజేపీ నేతలతో పాటు చాలా మంది ఇలాగే మాట్లాడుతున్నారని తెలిపారు. బహుశా మార్పులు జరగొచ్చని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలోనూ మరో అజిత్​ పవార్​ పుట్టుకురావచ్చని తెలిపారు. ఎవరు అజిత్ పవార్ అవుతారో, ఏం జరుగుతుందో వేచి చూద్దామని కుమార స్వామి వివరించారు.

'NCPలానే జేడీయూ కూడా చీలుతుంది'
Sushil Modi On Nitish Kumar : మహారాష్ట్రలో శివసేన, తర్వాత ఎన్​సీపీలో వచ్చిన తిరుగుబాటు.. ఇక జేడీయూలోనూ వస్తుందని భారతీయ జనతా పార్టీ నాయకులు.. చెబుతున్నారు. జేడీయూలో తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయని.. చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని.. బీజేపీ ఎంపీ సుశీల్ మోదీ చెప్పారు. నీతీశ్ కుమార్ వారసుడిగా ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ను అంగీకరించేందుకు జేడీయూ నేతలు సిద్ధంగా లేరని వెల్లడించారు. రాహుల్ గాంధీని విపక్ష నాయకుడిగా ఒప్పుకునేందుకు కూడా జేడీయూ నాయకులు సిద్ధంగా లేరని చెప్పారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Ajit Pawar NDA : కొద్దికాలంగా శరద్‌ పవార్‌ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్‌ పవార్‌.. ఆదివారం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో చేరారు. తనకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ఉండగా.. రెండో డిప్యూటీ సీఎంగా అజిత్​ పవార్​.. ప్రమాణం చేశారు.

ABOUT THE AUTHOR

...view details