'లవ్ జిహాద్' కేసు విషయంలో ఓ యువకుడిపై చర్యలు తీసుకోవద్దని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులను ఆదేశించింది అలహాబాద్ హైకోర్టు. జిస్టిస్ పంకజ్ నఖ్వీ, జస్టిస్ వివేక్ అగర్వాల్ సభ్యులుగా గల ధర్మాసనం ఈ విధంగా తీర్పునిచ్చింది.
లవ్ జిహాద్‌కు సంబంధించి ముజఫర్‌పుర్‌లో తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ నదీమ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. పిటిషనర్ తరఫున వాదించిన న్యాయవాది ఎస్ఎఫ్ఏ నఖ్వీ.. ఆర్డినెన్సు జారీ చేయడం రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఆర్డినెన్సు కింద నమోదు చేసిన నేరారోపణలు తొలగించాలని కోరారు.
ఈ నేపథ్యంలో.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవొద్దని పోలీసులను ఆదేశించింది. నదీమ్.. మత మార్పిడికి పాల్పడ్డాడనేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపింది.