స్వలింగ వివాహాలపై పూర్తి అవగాహన తెచ్చుకునేందుకు మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఓ మానసిక వైద్య నిపుణుడి(సైకాలజిస్టు) వద్దకు కౌన్సిలింగ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పుడే.. ఈ అంశంపై దాఖలైన ఓ కేసులో తాను మనసుతో ఆలోచించి తీర్పు రాయగలనని తెలిపారు. స్వలింగ వివాహాల విషయంలో మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ఓ మహిళా జంట దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.
"ఈ కేసులో కచ్చితంగా నా మాటలు తలలోంచి కాకుండా మనసులో నుంచి రావాలి. స్వలింగ సంబంధాలపై పూర్తి అవగాహన లేకుంటే అలా రావటం అసాధ్యం. అందుకోసం.. నేను విద్యా దినకరన్( సైకాలజిస్టు) కౌన్సెలింగ్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకోసం అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా దినకరన్‌ను కోరుతున్నాను.
- జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేశ్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి.