సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు రద్దయిన క్రమంలో.. విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించాల్సిన అంశంపై సీబీఎస్ఈ బోర్డు తుది నిర్ణయం తీసుకోవాలని దిల్లీ హైకోర్టు(Delhi High Court) ఆదేశించింది. ఈ మేరకు 8 వారాల గడువు ఇస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
పదో తరగతి పరీక్షల కోసం రూ. 2100 రుసుం చెల్లించిన ఓ విద్యార్థి తల్లి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చింది. సీబీఎస్ఈ తీసుకునే నిర్ణయంతో పిటిషనర్ సంతృప్తి చెందకపోతే.. ఆ నిర్ణయాన్ని సవాల్ చేయొచ్చని జస్టిస్ ప్రతీక్ జలన్ అన్నారు. ఇరువర్గాల వారి నిర్ణయం సహేతుకంగా ఉండాలని ఆదేశించారు.