తమిళనాడు ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలు కావటంతో భాజపా నాయకురాలు ఖుష్బూ.. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. నిరంతర కృషి, పట్టుదలతో బలమైన ప్రత్యర్థిని సైతం ఓడించవచ్చని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ స్పష్టం చేశారు.
చెపాక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి భాజపా తరఫునుంచి ఎన్నికల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు ఖుష్బూ. అయితే.. ఇదే నియోజకవర్గం నుంచి కరుణానిధి మనవడు, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి బరిలోకి దిగుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి
థౌజెండ్ లైట్స్ నియోజకవర్గంలో నీరు, డ్రైనేజీ, వీధి లైట్ల సమస్య ఉందన్నారు ఖుష్బూ. తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే కచ్చితంగా ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు. తమిళనాడులో భాజపాకు ఆదరణ లభిస్తోందన్నారు.
ఇంటింటి ప్రచారం..