Naveen Murder Case Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా నవీన్ హత్య కేసులో మరో ఇద్దరు అరెస్టు అయ్యారు. హరిహరకృష్ణ స్నేహితురాలు, స్నేహితుడు హసన్ అరెస్టు అయ్యారు. హసన్, యువతిని నిందితులుగా పోలీసులు చేర్చారు. నవీన్ హత్య కేసులో ఏ2గా హసన్, ఏ3గా యువతి పేరును పోలీసులు చేర్చగా.. హత్య విషయం తెలిసి కూడా దాచారని ఇద్దరిపై అభియోగాలు ఉన్నాయి.
పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాలు...
నవీన్ హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు హరిహర కృష్ణకు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హరిహర కృష్ణ స్నేహితుడు హసన్‌తో పాటు, స్నేహితురాలిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... హయత్ నగర్ కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. గత నెల 17వ తేదీన నవీన్‌ను హరిహర కృష్ణ అబ్దుల్లాపూర్ మెట్‌లోని నిర్మానుష ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు శరీరం నుంచి వేరు చేసి వాటిని సంచిలో వేసుకొని ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లిలోని హసన్ ఇంటికి వెళ్లాడు.
హసన్‌తో కలిసి హరిహర కృష్ణ, శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకుని దుస్తులను మార్చుకొని రాత్రి అక్కడే ఉండి... 18వ తేదీ ఉదయం బీఎన్ రెడ్డి నగర్‌లో ఉండే స్నేహితురాలి వద్దకు వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం తెలిపాడు. ఆమె వద్ద ఖర్చుల కోసం 1500 రూపాయలు తీసుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఫొన్‌లో నిహారిక, హసన్‌తో సంప్రదింపులు జరిపాడు.
20వ తేదీ సాయంత్రం మరోసారి యువతి వద్దకు వెళ్లి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత యువతిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. 21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహర కృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడు.
ఖమ్మం, విజయవాడ, వైజాగ్‌లో తలదాచుకుని 23వ తేదీ వరంగల్‌లో తండ్రి వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పోలీసులు హరిహరకృష్ణ కోసం గాలిస్తున్నట్లు తండ్రికి తెలియడంతో... వెంటనే పోలీసులకు లొంగి పోవాల్సిందిగా కుమారుడికి సూచించాడు. 24వ తేదీ హరిహర కృష్ణ హైదరాబాద్‌కు వచ్చి హసన్ వద్దకు వెళ్లాడు. హసన్, హరిహర కృష్ణ ఇద్దరూ కలిసి మన్నెగూడలో నవీన్ శరీర అవయవాలు పడేసిన ప్రాంతానికి వెళ్లాడు. వాటిని తిరిగి తీసుకొని హత్య చేసిన ప్రదేశానికి వచ్చి తగులబెట్టారు. ఆ తర్వాత బీఎన్ రెడ్డి నగర్‌లోని యువతి ఇంటికి వెళ్లి స్నానం చేశారు. ఆ సమయంలో యువతి ఇంట్లో తల్లిదండ్రులు లేరు. యువతి ఇంటి నుంచి బయల్దేరిన హరిహర కృష్ణ... ఆ తర్వాత నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
యువతిని, హసన్‌ను అరెస్టు చేశాం. నవీన్‌ను హరిహరకృష్ణ ఒక్కడే హత్య చేశాడు. హత్య విషయాన్ని స్నేహితుడు హసన్‌కు చెప్పాడు. హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణ పారిపోయాడు. హరిహరకృష్ణ ఖమ్మం, విజయవాడ, విశాఖ, వరంగల్‌కు వెళ్లాడు. గత నెల 24న తిరిగి వచ్చి యువతి, హసన్‌ను కలిశాడు. నవీన్‌కు యువతి 1500 రూపాయిలు ఇచ్చింది. నవీన్‌ను చంపిన చోటుకు యువతి, హసన్‌ను తీసుకెళ్లాడు. హత్య విషయం తెలిసినా ఇద్దరూ పోలీసులకు చెప్పలేదు. - ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ
ఇప్పటికే ప్రధాన నిందితుడు హరిహరకృష్ణను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. సీన్‌రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా బయటకి తీసుకెళ్లి.. దర్యాప్తు సమయంలో చెప్పిన ఆధారాలకు అనుగుణంగా దర్యాప్తు చేపడుతున్నారు. తద్వారా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నగరశివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో ఫిబ్రవరి 17న నవీన్‌ను హత్యచేయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఓ యువతి కోసం స్నేహితుడినే హతమార్చాడని హరిహర కృష్ణపై ఆరోపణలు ఉన్నాయి.
ఇవీ చదవండి: