తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రైవేటు ఉద్యోగాల్లో 75శాతం స్థానికులకే'

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లుకు హరియాణా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీలు, భాగస్వామ్యం సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, ఇతర సంస్థల్లో ఈ కోటా ప్రకారమే ఉద్యోగ అవకాసాలు కల్పించాల్సి ఉంటుంది.

dushyanth chouthala
దుష్యంత్‌ చౌతాలా

By

Published : Nov 5, 2020, 10:43 PM IST

ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేస్తూ హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 75% రిజర్వేషన్లు కల్పించేలా రూపొందించిన బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. హరియాణాలోని ప్రైవేటు కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, ఇతర సంస్థల్లో ఉద్యోగాల కల్పనలో ఈ కోటా ప్రకారమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బిల్లులో పేర్కొన్నారు.

దీంతో రూ.50వేలు కంటే తక్కువ వేతనం కలిగిన ఉద్యోగాల్లో మూడో వంతు స్థానికులకే కల్పించనున్నారు. అయితే, ఏదైనా ఒక కంపెనీకి అవసరమైన అభ్యర్థులు స్థానికంగా అందుబాటులో లేకపోతే సంబంధిత కంపెనీకి దీని నుంచి మినహాయింపు కల్పిస్తూ నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచింది.

గతేడాది అక్టోబర్‌లో జరిగిన హరియాణా ఎన్నికల్లో జేజేపీ అధినేత దుష్యంత్‌ చౌతాలా.. ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల అనంతరం భాజపాకు మద్దతు పలికి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఈ బిల్లును అసెంబ్లీలో గురువారం ఆయనే ప్రవేశపెట్టడం గమనార్హం. గవర్నర్‌ ఆమోదం అనంతరం ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.

ఈ బిల్లులను ముందుగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించినప్పటికీ.. కరోనా మహమ్మారి కారణంగా ఆగస్టులో కేవలం ఒక్కరోజుతోనే శాసనసభ సమావేశాలు ముగించారు.

ఇదీ చూడండి:'దీర్ఘకాల పెట్టుబడులకు భారత్​ ఉత్తమ స్థానం'

ABOUT THE AUTHOR

...view details