బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు చట్టాన్ని తీసుకురాగా.. తాజాగా హరియాణా ప్రభుత్వం కూడా సిద్ధమైంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో 'లవ్ జిహాద్' బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
"బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా ముసాయిదా బిల్లును రూపొందించాం. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతాం."
-అనిల్ విజ్, హరియాణా హోం మంత్రి
లవ్‌జిహాద్ బిల్లును రూపొందించడానికి ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు గతేడాది నవంబర్26న అనిల్ విజ్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు రూపొందించిన లవ్‌జిహాద్ చట్టాలను ఈ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.