దిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున సాగు చట్టాలపై ఆందోళనలు తీవ్రతరం చేసేందుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. హరియాణా గ్రామీణ ప్రాంత రైతులు భారీగా టిక్రీ సరిహద్దు వద్దకు తరలివస్తున్నారు.
"హరియాణాలోని కర్నాల్ నుంచి వేలాది వాహనాలతో దిల్లీకి వస్తున్నాం. ప్రతి వారం ఒక్కో జిల్లా నుంచి రైతులను దీక్షాస్థలి వద్దకు తీసుకొచ్చి... ఉద్యమాన్ని కొనసాగిస్తాం" అని చెప్పారు భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్ సింగ్.