నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో ఉద్యమిస్తున్న రైతులపై హరియాణా పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. సోనిపట్ జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై అక్రమంగా కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టడం, బోర్వెల్ తవ్వకంపై ఈ కేసులు నమోదు చేశారు.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ, స్థానిక అధికారుల ఫిర్యాదులతో సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని కుండ్లి ఇన్స్పెక్టర్ రవి కుమార్ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే అక్రమ నిర్మాణాలు ఆపేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.