తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య- నోటిలో రాళ్లు వేసి.. - పానీపత్​లో బాలిక మిస్సింగ్​

Panipat girl murdered: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ ఏడేళ్ల బాలిక.. అత్యంత దారుణంగా హత్యకు గురైంది. బాలిక నోటిలో రాళ్ల ముక్కలు వేసి నిందితులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన హరియాణాలో జరిగింది.

Panipat girl murdered
ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య

By

Published : Dec 15, 2021, 6:46 AM IST

Panipat girl murdered: హరియాణా పానీపత్​లో పాశవిక ఘటన వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ ఏడేళ్ల చిన్నారి.. మంగళవారం అత్యంత దారుణ స్థితిలో విగతజీవిగా కనిపించింది. చిన్నారి నోటిలో రాళ్ల ముక్కలు ఉన్నాయి.

అసలేం జరిగిందంటే...

Haryana cirme news: పానీపత్​లోని సమాలఖా గ్రామానికి చెందిన చిన్నారి.. మనానా గ్రామంలోని ఓ గుడి వద్ద అన్నదాన కార్యక్రమానికి ఆదివారం ఉదయం వెళ్లింది. సాయంత్రం వరకు అక్కడే ఆడుకుంటూ ఉన్న బాలిక.. ఆ తర్వాత అదృశ్యమైందని బంధువులు తెలిపారు. ఆ రాత్రికి ఇంటికి కూడా రాలేదని చెప్పారు.

అతడే తీసుకువెళ్లాడా?

ఎరుపు రంగు బైక్​ మీద వచ్చిన ఓ వ్యక్తి సదరు చిన్నారిని తీసుకువెళ్లాడని ఆమెతో పాటు గుడి వద్ద ఆడుకుంటూ ఉన్న మిగతా పిల్లలు తెలిపారు. బైక్​ మీద వచ్చిన వ్యక్తి మాస్కు ధరించాడని చెప్పారు. దీనిపై పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే.. రెండు రోజుల తర్వాత మంగళవారం సాయంత్రం బాలిక మృతదేహాన్ని మనాగా గ్రామంలోని ఓ స్టేడియం వద్ద పోలీసులు గుర్తించారు. చిన్నారి నోట్లో రాళ్ల ముక్కలు ఉన్నాయని తెలిపారు. బాలికపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేశారని బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.

ఈ కేసు తీవ్రత దృష్ట్యా.. నిందితుల గురించి సమాచారం అందించినవారికి రూ.50,000 రివార్డు అందిస్తామని పానీపత్ ఎస్పీ ప్రకటించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు అనేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు.

ఇదీ చూడండి:ప్రియురాలిపై కోపంతో.. ఇద్దరిని కత్తితో పొడిచాడు

ABOUT THE AUTHOR

...view details