తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలివే.. - హరియాణా, ఒడిశా, తెలంగాణాల్లో లాక్​డౌన్​ పొడిగింపు

దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తి కట్టడికి వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. హరియాణా, ఒడిశా, తెలంగాణ, సిక్కింలో లాక్​డౌన్​ను పొడిగించారు. కేసుల సంఖ్య తగ్గిన జిల్లాలో ఉత్తర్​ప్రదేశ్​, జమ్మూకశ్మీర్​లు నిబంధనలను సడలించాయి. ఇంకా ఏయే రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు అమల్లో ఉన్నాయంటే..

lockdown extended
లాక్​డౌన్​ పొడిగించిన రాష్ట్రాలు

By

Published : May 31, 2021, 6:36 AM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి. మరోవైపు కేసుల సంఖ్య తగ్గిన రాష్ట్రాలు నిబంధనలను సడలిస్తున్నాయి.

లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?

  • సిక్కింలో జూన్ 7 వరకు లాక్​డౌన్​ పొడిగించారు. దుకాణాలు, వ్యవసాయం వంటి పనులకు సడలింపునిచ్చారు.
  • రాజస్థాన్​లో జూన్​ 8 వరకు లాక్​డౌన్​ పొడిగించారు.
  • ఒడిశాలో మరో 16 రోజులు లాక్‌డౌన్‌ (జూన్​ 17 వరకు) అమల్లో ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనలే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
  • కేరళలో కొన్ని నిబంధనల సడలింపుతో లాక్​డౌన్​ను జూన్​ 9 వరకు పొడిగించారు.
  • తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో లాక్​డౌన్​ను జూన్​ 7 వరకు పొడిగించారు.
  • తెలంగాణలో లాక్​డౌన్​ను మరో 10 రోజులు (జూన్​ 9 వరకు) పొడిగించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిబంధనలను సడలించారు.
  • హరియాణాలో జూన్​ 17 వరకు పొడిగించారు. ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సడలించారు.
  • నాగాలాండ్​లో జూన్​ 11 వరకు లాక్​డౌన్​ను పొడిగించారు.
  • మిజోరంలో ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న లాక్​డౌన్​ను జూన్​ 6 వరకు పొడిగించారు.
  • ఛత్తీస్​గడ్​లో లాక్​డౌన్​ మే 31 తో ముగియనుంది.
  • బిహార్‌లో జూన్​ 1 వరకు లాక్​డౌన్​ కొనసాగుతుంది.
  • ఝార్ఖండ్​లో జూన్​ 3 వరకు లాక్​డౌన్​ విధించారు.

ఇదీ చదవండి:22 ఏళ్లలో 16 వేల శవాలకు అంత్యక్రియలు

వారాంతాల్లో..

  • జమ్ముకశ్మీర్​లో కొవిడ్​ అన్​లాక్​ ప్రక్రియ మొదలైంది. కానీ రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్​డౌన్​లు కొనసాగుతున్నాయి.
  • చండీగడ్​లో వారాంతపు లాక్‌డౌన్​లతో పాటు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.
  • మధ్యప్రదేశ్​లో జూన్​ 1 నుంచి కరోనా నిబంధనలను దశలవారిగా సడలించనున్నారు. వారాంతపు లాక్​డౌన్​ను మే 31 తర్వాత కూడా యథావిధిగా కొనసాగించనున్నారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలను జూన్ 7 వరకు పొడిగించారు. కొన్ని నిబంధనలను సడలించారు.

ఇదీ చదవండి:కరోనాను జయించారా? ఈ టెస్టులు చేయిస్తే బెటర్!

లాక్‌డౌన్‌ తరహా..

  • బంగాల్​లో కరోనా నిబంధనలను జూన్​ 15 వరకు పొడిగించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో 20 జిల్లాల్లో లాక్​డౌన్​ను కొసాగిస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్​డౌన్​లు యాథావిధిగా ఉన్నాయి. జూన్​ 1 నుంచి నిబంధనల సడలింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
  • పంజాబ్​లో జూన్​ 10 వరకు కరోనా నిబంధనలు కొనసాగననున్నాయి.
  • మహారాష్ట్రాలో నిబంధనలను జూన్​ 15 వరకు పొడిగించారు. కొన్ని నిబంధనలను సడలించారు.
  • దిల్లీలో అన్​లాక్​ ప్రక్రియ జూన్​1 నుంచి ప్రారంభం కానుంది. కానీ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్​డౌన్​ కొనసాగనుంది.

ఇదీ చదవండి:విమానాలతో శానిటైజేషన్- గాలిలో కరోనాకు చెక్​!

కర్ఫ్యూలు..

  • గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో జూన్​ 4 వరకు అమలు చేస్తున్నారు.
  • గోవాలో ప్రస్తుతం కొనసాగుతున్న కర్ఫ్యూను జూన్​ 7వరకు పొడిగించారు.
  • మణిపుర్‌లోని 7 జిల్లాల్లో జూన్​ 11 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.
  • త్రిపురలో ప్రధాన నగరాలు, మున్సిపల్​ ప్రాంతాల్లో జూన్​ 5 వరకు కర్ఫ్యూ పొడిగించారు.
  • ఉత్తరాఖండ్‌లో రాత్రి కర్ఫ్యూ జూన్​ 1 వరకు కొనసాగనుంది.

ఇదీ చదవండి:తమిళనాడులో దిగొస్తున్న కొవిడ్​ కేసులు

Viral Video: నదిలో కొవిడ్‌ మృతదేహాన్ని పడేస్తూ...

ABOUT THE AUTHOR

...view details