తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Viral: టీ స్టాల్​లో ప్లేట్లు కడిగిన కోతి! - కోతి ఫన్నీ వీడియోలు ఆన్​లైన్

అక్కడా ఇక్కడా తిరుగుతూ దొరికినవి తింటూ కాలక్షేపం చేసే ఓ కోతి.. పని బాట పట్టింది. చెట్లపై గెంతి.. జనావాసాల్లో తిరిగి తిరిగి బోర్​కొట్టిందో ఏమో.. అచ్చం మనిషిలాగా టీ స్టాల్​లో ప్లేట్లు కడుగుతూ దర్శనమిచ్చింది.

monkey washes plates
కోతి చేష్టలు.. టీ స్టాల్​లో ప్లేట్లు కడిగిన వానరం!

By

Published : Jul 4, 2021, 11:52 AM IST

Updated : Jul 4, 2021, 2:03 PM IST

రొటీన్​కి భిన్నంగా ట్రై చేద్దాం అనుకున్న ఓ కోతి ఏం చేసిందో చూస్తే వావ్​ అనకుండా ఉండలేరు. ఓ టీ స్టాల్​లో.. అచ్చం మనిషిలాగే కూర్చుని ప్లేట్లు, గ్లాసులు కడిగింది ఆ కోతి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

టీ స్టాల్​లో ప్లేట్లు కడుగుతున్న ఓ కోతి చుట్టూ ప్రజలు గుమిగూడి.. అది చేస్తున్న పనులను ఆసక్తిగా గమనిస్తూ ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. ప్లేట్లు కడుగుతూ.. వాటిని నీళ్లలో ముంచుతూ మధ్యమధ్యలో సరిగ్గా శుభ్రం చేశానా? లేదా? అని కోతి చూడటం విశేషం. ఈ వీడియో చూపరులకు నవ్వులు తెప్పిస్తోంది.

అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు కోతిని మెచ్చుకుంటుంటే, జంతుప్రేమికులు మాత్రం.. ఇది మూగజీవాలపై హింసేనని ఆరోపిస్తున్నారు. కోతిని నిర్భందించారని మరికొందరు ఆరోపిస్తూ కామెంట్లు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 4, 2021, 2:03 PM IST

ABOUT THE AUTHOR

...view details