హరియాణాలోని భివానీ జిల్లాలో పాశవిక ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు.. 6 నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలిక గర్భం దాల్చగా రేప్ విషయం బయటపడింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బాలిక వెళ్లగా.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తొలుత ఆమెపై కొద్ది మంది లైంగికదాడికి పాల్పడ్డారని, అనంతరం మిగతావారూ ఆమెను వేధిస్తూ వచ్చారని చెప్పారు. అత్యాచార విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించారని తెలిపారు. నిందితుల్లో ఓ తండ్రీ కుమారుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు.