తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పరువు' కోసం ప్రేమపై తండ్రి పగ.. సొంత కుమార్తె దారుణ హత్య - honour killing cases in india

Haryana honour killing: కుమార్తె ప్రేమ వ్యవహారం నచ్చని ఓ తండ్రి.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. ప్రమాదవశాత్తూ చనిపోయిందని పోలీసులను నమ్మించేందుకు యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. హరియాణా సోనిపత్​ జిల్లాలో జరిగిందీ ఘటన.

haryana honour killing
'పరువు' కోసం ప్రేమపై తండ్రి పగ.. సొంత కుమార్తె దారుణ హత్య

By

Published : Apr 7, 2022, 11:03 AM IST

Haryana honour killing: హరియాణా సోనిపత్ జిల్లా భదానాలో జరిగిన 'పరువు హత్య' స్థానికంగా కలకలం రేపింది. గ్రామంలోని ఓ యువకుడ్ని తన కుమార్తె ప్రేమించడాన్ని ఏమాత్రం సహించలేకపోయిన తండ్రి.. ఆమెను గొంతు నులిమి కిరాతకంగా చంపేశాడు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు.

మెట్లపై నుంచి జారి పడిందని...: పోలీసుల కథనం ప్రకారం.. భదానా గ్రామంలో ఓ మైనర్ అనుమానాస్పద స్థితిలో మరణించిందని సమాచారం అందించింది. పోలీసులు ఇంటికెళ్లి చూడగా.. ఓ మంచంపై బాలిక మృతదేహం కనిపించింది. మెట్లపై నుంచి జారిపడి మరణించిందని ఆమె తండ్రి, బంధువులు చెప్పారు. అయితే.. ఇది ప్రమాదవశాత్తూ సంభవించిన మరణం కాదని, హత్యేనని భావించిన పోలీసులు.. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టంకు పంపించారు. పోలీసుల విచారణలో అసలు విషయం ఒప్పుకున్నాడు మృతురాలి తండ్రి. ఓ యువకుడిని తన కుమార్తె ప్రేమించిందని, అది నచ్చకే ఆమెను చంపేశానని చెప్పాడు. తండ్రిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడ్ని కస్టడీలో ఉంచి ప్రశ్నిస్తున్నారు.

వివాహేతర సంబంధంపై కన్నెర్ర: మరోవైపు.. వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ ఓ జంటపై దాడి చేశారు ఝార్ఖండ్ దుమ్కా జిల్లా షికారీపాఢా ప్రజలు. ఇద్దరినీ రోడ్డుపైకి లాక్కొచ్చి చేతులు కట్టేశారు. దుస్తులు చించేసి, చెప్పుల దండ వేశారు. అలా గ్రామంలో అందరూ చూస్తుండగా కిలోమీటరు దూరం నడిపించారు. ఇదంతా వీడియో తీశారు.

వివాహేతర సంబంధంపై కన్నెర్ర

విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లారు. అతి కష్టం మీద ఆ మహిళను, పురుషుడ్ని గ్రామస్థుల నుంచి విడిపించి.. ఆస్పత్రికి తరలించారు. "మహిళకు మరో వ్యక్తితో పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పక్క ఊరికి చెందిన ఓ వ్యక్తికి కూడా పెళ్లయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా.. ఆ ఇద్దరూ వారివారి కుటుంబాలను మోసం చేసి వివాహేతర సంబంధం సాగిస్తున్నారు. ఈ మధ్య అతడు పదేపదే ఆమె ఇంటికి వస్తున్నాడు. అందుకే రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నాం." అని గ్రామస్థులు తమకు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అయితే.. ఇలా చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోరాదని ఊరి ప్రజలకు వివరించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details