కరోనాను రూపుమాపడానికి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవాగ్జిన్ టీకాను తనపై ప్రయోగించుకోనున్నారు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ డోస్‌ను తీసుకోనున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్లో ప్రకటించారు. పీజీఐ రోహ్తక్ వైద్యుల బృందం సమక్షంలో ఈ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలిపారు.
కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాల కోసం బుధవారమే.. వలంటీరుగా నమోదు చేయించుకున్నారు అనిల్ విజ్.