తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచారం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన మహిళపై మరోసారి.. - హిస్సార్ జిల్లా రేప్ వార్తలు

ఆమెపై గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ఆ మహిళను.. నమ్మించి.. దగ్గరయ్యాడు. ఈ క్రమంలో గదిలో బంధించి మరోసారి అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు.

rape
రేప్

By

Published : Dec 14, 2021, 8:58 PM IST

హరియాణాలోని హిస్సార్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. అత్యాచార బాధితురాలిపై మరోసారి అఘాయిత్యానికి తెగబడ్డాడో వ్యక్తి. గతంలో ఈ దారుణానికి ఒడిగట్టిన వాడే మరోసారి ఆమెను బంధించి ఈ ఘోరం చేయడం గమనార్హం. దీనిపై బాధిత మహిళ ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

పాత కేసు గురించి మాట్లాడలంటూ..

తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో అశోక్ అనే వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత కొన్ని నెలలకు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్లిపోయింది ఆమె.

2021 ఫిబ్రవరిలో ఆ కేసుపై వాంగ్మూలం ఇచ్చేందుకు అత్తమామల ఇంటి నుంచి హిస్సార్​కు వచ్చింది. ఆ సమయంలో నిందితుడైన అశోక్ ఆమెను బస్టాండ్‌లో కలుసుకున్నాడు. కేసు గురించి మాట్లాడాలని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే అంతకుముందు తనపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని కోరాడు. దీంతో ఆమె కేసును విత్​డ్రా చేసుకుంది.

ఈ క్రమంలో నిందితుడు తన వక్రబుద్ధిని మరోసారి చాటుకున్నాడు. తనను నమ్మిన ఆమెను గదిలో బంధించి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

అనంతరం వివాహం విషయం ప్రస్తావించగా తిరస్కరించాడు. నిలదీసి అడగ్గా చంపేస్తానని బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ.. ఆజాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details