Surprising Answers in Haryana Board Exam: హరియాణా పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ఆసక్తికర ఘటన జరిగింది. కొందరు విద్యార్థులు తమని పాస్ చేయాలంటూ రాసిన సమాధానాలు చూసిన ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. ఓ విద్యార్థిని తనను పాస్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానని జవాబు పత్రంలో రాసింది. తనను కూతురిలా భావించి పాస్ చేయాలని వేడుకుంది. "నా తండ్రి మద్యానికి బానిసయ్యాడు. సవతి తల్లి, చెల్లి తీవ్రంగా హింసిస్తున్నారు. నాకు ఆర్మీలో చేరాలని కోరిక. ఈ పరీక్షల్లో 75 శాతం మార్కులు రాకపోతే మా నాన్న పెళ్లి చేస్తానన్నాడు. మీ కూతురిలా భావించి నన్ను పాస్ చేయండి" అంటూ జవాబు పత్రంలో రాసింది.
'మార్కులు రాకపోతే పెళ్లి చేస్తారటా.. పాస్ చేయండి సార్'
Surprising Answers in Haryana Board Exam: తనని పాస్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బోర్డు పరీక్షల్లో రాసింది ఓ విద్యార్థిని. మరో విద్యార్థి ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు తనను పాస్ చేయడంటూ రాశాడు. ఈ వింత జవాబులన్నీ హరియాణాలోని బోర్డు పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో బయటపడ్డాయి.
ఓ జవాబుపత్రంలో 'ఈ ప్రశ్నకు సమాధానం తెలియదు. దయచేసి నన్ను పాస్ చేయండి' అంటూ రాశాడు మరో విద్యార్థి. తనని తాను మెచ్చుకుంటూ జవాబు పత్రంలో రాశాడు. తాను మంచి విద్యార్థిని అని ఎలాగైనా పాస్ చేయడంటూ వేడుకున్నాడు. వీటిపై స్పందించిన జిల్లా విద్యాశాఖాధికారి దయానంద్ సింగ్.. కొంత మంది పిల్లలు అల్లరి చేస్తూ పేపర్‌పై తప్పుగా రాస్తున్నారు. బోర్డ్ ఎగ్జామినేషన్‌లో ఇలాంటి పనులు చేయకూడదని ఉపాధ్యాయులు తరగతి గదిలోనే పిల్లలకు చెప్పాలన్నారు.
ఇదీ చదవండి:"జనగణమనలో 'సింధ్'ను తొలగించండి.. పాక్‌ను కీర్తిస్తూ పాడేదెలా?"