భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) హరియాణా ప్రధాన కార్యదర్శి జస్తేజ్ సింగ్ సంధూపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. హరియాణాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి వెళుతున్న సమయంలో సోమవారం ఈ దాడి జరిగింది.
హరియాణాలో రైతు నేతపై కాల్పులు - బీకేయూ
హరియాణాలో రైతు నేత జస్తేజ్ సింగ్‌పై కాల్పులు జరిపారు దుండగులు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న రైతులను కలవడానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి చేశారు.
![హరియాణాలో రైతు నేతపై కాల్పులు Haryana BKU leader Jastej Singh escapes unhurt as bike-borne assailants open fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10737246-50-10737246-1614026147691.jpg)
హరియాణాలో రైతు నేతపై కాల్పులు
జస్తేజ్.. హరియాణా వ్యవసాయ శాఖ మాజీ మంత్రి జస్విందర్ సంధూ పెద్ద కుమారుడు. పెహోవా వద్ద టోల్ ప్లాజా వైపు వెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు ఆయన కారును ఓవర్టేక్ చేశారు. వారిలో ఒకరు కారు సమీపంలోకి వచ్చి తుపాకీతో కాల్చారు. అదృష్టవశాత్తు డ్రైవర్ సీట్ విండో నుంచి బుల్లెట్ అవతలి విండోలోకి వెళ్లడం వల్ల జస్తేజ్ క్షేమంగా బయటపడ్డారు.
అదుపులోకి తీసుకున్న కారును ఫోరెన్సిక్ బృందం పరిశీలిస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.