తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గర్ల్​ఫ్రెండ్​ కోసం ఐపీఎస్ అధికారి అవతారం.. చివరకు... - నకిలీ పోలీస్ అధికారి

ప్రియురాలిని ఇంప్రెస్ చేసేందుకు ఓ యువకుడు ఏకంగా నకిలీ ఐపీఎస్ అధికారి అవతారం ఎత్తాడు. అంతటితో ఆగకుండా.. పోలీసులనూ బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

police nab Mumbai man
నకిలీ పోలీస్

By

Published : Oct 28, 2021, 3:52 PM IST

ఐపీఎస్ అధికారినంటూ మాయమాటలు చెప్పి గర్ల్​ఫ్రెండ్​ను నమ్మించాడు ఓ యువకుడు. అంతేకాక పోలీసులనూ బెదిరించబోయి.. చివరకు వారి చేతికే చిక్కాడు.

ఏం జరిగిందంటే..?

ముంబయి ఠాణెకు చెందిన సాగర్ వాగ్​మరే(28).. తాను ఐపీఎస్ అధికారినంటూ ప్రేయసిని నమ్మించాడు. రెండురోజుల క్రితం గర్ల్​ఫ్రెండ్​తో కలిసి ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​కు వచ్చాడు. తాను 2018 బ్యాచ్ ఐపీఎస్ అధికారినంటూ స్థానిక పోలీసులకు చెప్పాడు. తమకు నగరంలోని ఓ హోటల్​లో గదిని బుక్ చేయాలని ఆదేశించాడు. సాగర్ ప్రవర్తనపై అనుమానం కలిగిన సదరు పోలీసులు.. అతడి గురించి ఆరా తీశారు.

2018 బ్యాచ్​లో సాగర్ పేరుతో ఐపీఎస్ అధికారి లేకపోవటం వల్ల.. అతడు​ మాయచేస్తున్నాడని నిర్ధరించుకున్నారు. దీంతో నిందితుడిని స్టేషన్​కు తీసుకెళ్లి జిల్లా ఎస్​పీ యోగేంద్ర రావత్ ఆధ్వర్యంలో.. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు సంగతి బయటపడింది.

పోలీసులు వివిధ సెక్షన్​ల కింద సాగర్​పై కేసు పెట్టి, అరెస్ట్​ చేశారు.

మరో ఘటన..

ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఐపీఎస్​ అధికారిగా నమ్మిస్తూ.. పలు మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ప్రయాగ్​రాజ్ ప్రత్యేక కార్యదళం అరెస్ట్ చేసింది.

ఇదీ చూడండి:ట్రాన్స్​ఉమన్​తో యువకుడి పెళ్లి.. తల్లిదండ్రులు నో చెప్పినా...

ABOUT THE AUTHOR

...view details