తల్లీకుమారులపైకి దూసుకెళ్లిన బస్సు ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని చంఢీచౌక్లో ఓ బస్సు డివైడర్ మీద కూర్చుని ఉన్న తల్లి, కూమారుడి మీదుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారికి తీవ్రగాయాలయ్యాయి. తల్లి రెండు కాళ్లు అక్కడికక్కడే తెగిపడ్డాయి. కుమారుని కాళ్లు మాత్రం బస్సుకు డివైడర్‌కు మధ్యలో ఇరుక్కుపోయాయి.
ఇదీ జరిగింది...
చంఢీచౌక్లోని డివైడర్ మీద తల్లీ, కుమారుడు కూర్చొని ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ బస్సు వేగంగా మలుపు తిరిగే క్రమంలో అక్కడే కూర్చున్న వారి మీదకు దూసుకెళ్లింది. వారి కాళ్లు డివైడర్‌కు, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయాయి. స్థానికులు వారని బయటకు తీసి హరిద్వార్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు.
ఈ బస్సు రాజస్థాన్ నుంచి చంఢీఘాట్ చౌక్‌కు యాత్రికులను తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. బాధితులను ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన షాకిబ్, షానవాజ్‌లుగా గుర్తించారు.
ఇదీ చూడండి:సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఒంటికి నిప్పంటించుకొని..