తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ X దీదీ: సీఎస్​ విషయంలో మమత సూపర్ స్కెచ్! - దీదీ

బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ ఇవాళ పదవీ విరమణ చేస్తారని తెలిపారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఆయన స్థానంలో హరే క్రిష్ణ ద్వివేదిని కొత్త సీఎస్​గా నియమించారు. బంధోపాధ్యాయ్​ వచ్చే మూడేళ్ల పాటు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

Mamata
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ

By

Published : May 31, 2021, 5:43 PM IST

Updated : May 31, 2021, 6:43 PM IST

బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ విషయంలో మోదీ ప్రభుత్వానికి షాక్​ ఇచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బంధోపాధ్యాయ్​ను మంగళవారం దిల్లీలో రిపోర్ట్​ చేయాలని కేంద్రం మరోమారు లేఖ పంపిన నేపథ్యంలో కీలక ఎత్తుగడ వేశారు. సీఎస్​గా కొనసాగించకుండా పదవీ విరమణ చేయించి.. సీఎంకు ముఖ్య సలహాదారుగా నియమించారు. మంగళవారం నుంచే అది అమలులోకి వస్తుందని, వచ్చే మూడేళ్ల పాటు తనకు సలహాదారుగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

"నార్త్​బ్లాక్​లో మంగళవారం రిపోర్ట్​ చేయాలని బంధోపాధ్యాయ్​ను కేంద్రం కోరింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్​పై రావాలని ఒక అధికారిపై ఒత్తిడి చేయకూడదు. సీఎస్​కు కేంద్రం లేఖ పంపింది. అది నా లేఖకు సమాధానం కాదు. ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు. కేంద్రం నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధం. మేము ఆయన్ను రిలీవ్​ చేయటం లేదు. ఈరోజే పదవీ విరమణ పొందుతారు. కానీ, వచ్చే మూడేళ్ల పాటు సీఎంకు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తారు. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

అంతకు ముందు బంధోపాధ్యాయ్​ విషయంలో ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు దీదీ. ఆలాపన్​ను తాము రిలీజ్​ చేయలేమని పేర్కొన్నారు.

కొత్త సీఎస్​గా.. హరే క్రిష్ణ

బంధోపాధ్యాయ్​ స్థానంలో హరే క్రిష్ణ ద్వివేదిని కొత్త సీఎస్​గా నియమించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అలాగే.. బీపీ గోపాలికను హోంశాఖ సెక్రెటరీగా నియమిస్తున్నట్లు చెప్పారు.

షోకాజ్​ నోటీసులు..

ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. దిల్లీలోని నార్త్​ బ్లాక్​లో సోమవారం రిపోర్ట్​ చేయకపోవటంపై బంగాల్​ సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​కు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) షోకాజ్​ నోటీసులు ఇచ్చింది. అందుకు గల కారణాలను వివరించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:'కేంద్రం వైఫల్యంతో 97% మంది ప్రజలకు నష్టం!'

Last Updated : May 31, 2021, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details