తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కష్టాల కడలి ఈదలేక.. కుటుంబం ఆత్మహత్య - కేరళలో కుటుంబం ఆత్మహత్య

Family suicide: కేరళ పాలక్కడ్​లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కష్టాల కారణంగా వారంతా నదిలో దూకి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

Hardship drives four of family to suicide
కష్టాల కడలి ఈదలేక.. కుటుంబం ఆత్మహత్య

By

Published : Feb 27, 2022, 7:30 AM IST

Family suicide: కేరళలోని పాలక్కడ్​లో దారుణం జరిగింది. ఒకే కుటుంబంలోని నలుగురు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కష్టాలు తట్టుకోలేకే వారు నదిలో దూకినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహాలను వెలికి తీస్తున్నట్లు చెప్పారు.

కష్టాలను ఎదుర్కొలేకే కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు సమీప బంధువులు కూడా తెలిపారు. శుక్రవారం వారందరూ కనిపించలేదని.. ఇంటికి వెళ్లి చూడగా సూసైడ్ నోట్ దొరికిందని పేర్కొన్నారు. చనిపోయిన ఆ నలుగురు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సూసైడ్​ నోట్​లో పేర్కొన్నారని పోలీసులు చెప్పారు. ఆ ప్రాంతంలో వారికి సంబంధించిన పాదరక్షలు, బట్టలు నది ఒడ్డున పడి ఉండడం చూసి ఆత్మహత్యగా నిర్ధారించుకున్నట్లు స్పష్టం చేశారు.

వారి మృతదేహాలను శవపరీక్ష కోసం పంపినట్లు పోలీసులు చెప్పారు. కుటుంబ పెద్దపై గతంలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో ఓ హత్య కేసు కూడా ఉందని వివరించారు.

ఇదీ చూడండి:

ఉక్రెయిన్​లో చిక్కుకున్న కుమార్తెను తీసుకొస్తానంటూ మహిళకు టోకరా

ABOUT THE AUTHOR

...view details