Hardik Patel BJP: పాటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ మాజీ నాయకుడు హార్దిక్ పటేల్.. కాషాయ దళంలో చేరనున్నారు. జూన్ 2న భాజపా గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్న వేళ భాజపాలో హార్దిక్ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
భాజపాలోకి హార్దిక్ పటేల్.. ముహూర్తం ఫిక్స్.. కాంగ్రెస్‌కు ఇక కష్టమే! - undefined
Hardik Patel BJP: గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్‌ను వీడిన పాటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్.. జూన్ 2న భాజపాలో చేరనున్నారు.
కొన్నేళ్ల క్రితం గుజరాత్లో జోరుగా సాగిన పాటీదార్ ఉద్యమంలో హార్దిక్ కీలక పాత్ర పోషించారు. 2019లో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. అయితే.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందే.. హార్దిక్ కాంగ్రెస్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. పేరుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బహిరంగంగానే విమర్శించారు.
వారికి చికెన్ సాండ్విచే ముఖ్యం:పార్టీని వీడిన అనంతరం కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు హార్దిక్ పటేల్. రాష్ట్ర నాయకులకు దిల్లీ నుంచి వచ్చిన పార్టీ పెద్దలకు చికెన్ సాండ్విచ్ సమయానికి అందిందో లేదో చూసుకోవడమే ముఖ్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా పట్టవని ధ్వజమెత్తారు. సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా తీసుకోదని, అదే అతిపెద్ద సమస్య అని ఆరోపించారు. దేశం సవాళ్లు ఎదుర్కొనే సమయంలో సరైన నాయకత్వం అవసరమైన ప్రతిసారి పార్టీ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్తారని విమర్శించారు. గుజరాత్, గుజరాతీలు అంటే పడనట్లు కాంగ్రెస్ అధినాయకత్వం మాట్లాడుతుందని, అలాంటప్పుడు రాష్ట్రంలో భాజపాకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు.
TAGGED:
hardik patel bjp