తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెట్రోల్ ధరల​పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు.. త్వరలో గుడ్​ న్యూస్​! - పెట్రోల్​ ధరలు

పెట్రోల్​ ధరల వ్యవహారంలో రానున్న నెలల్లో దేశ ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశమున్నట్టు తెలిపారు పెట్రోలియంశాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​​ పూరీ. పెట్రోల్​ ధర అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితంమైనదిగా పరిగణిస్తున్నట్టు స్పష్టం చేశారు.

petrol
పెట్రోల్​

By

Published : Aug 24, 2021, 8:26 PM IST

దేశంలో ఇంధన ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు పెట్రోలియంశాఖ మంత్రి హర్​దీప్​ సింగ్​ పూరీ​. పెట్రోల్​ ధరల వ్యవహారాన్ని కేంద్రం అత్యంత సున్నితమైనదిగా పరిగణిస్తున్నట్టు తెలిపారు. రానున్న నెలల్లో దేశ ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశమున్నట్టు వెల్లడించారు.

"అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. స్థిరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో దేశ ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది. ఈ విషయంలో కేంద్రం చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది."

-హర్​దీప్​ సింగ్​ పూరీ​, పెట్రోలియంశాఖ మంత్రి

పెట్రోల్​ ధరలకు రెక్కలొచ్చాయంటూ విపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని సమర్థించారు పూరీ. లీటర్​ పెట్రోల్​పై ప్రభుత్వం రూ. 32 ఎక్సైజ్​ సుంకాన్ని విధిస్తుందని.. ఆ డబ్బును వివిధ సంక్షేమ పథకాల కోసం వినియోగిస్తుందని వెల్లడించారు.

2010 ఏప్రిల్​లో నాటి ప్రభుత్వం విధించిన ఎక్సైజ్​ సుంకాలే ఇప్పుడు కూడా అమల్లో ఉన్నట్టు స్పష్టం చేశారు పూరీ.

"ఉదాహరణకు.. అంతర్జాతీయంగా చమురు ధర లీటర్​కు 19డాలర్లు 60 సెంట్లుగా ఉన్నప్పుడు.. కేంద్ర ప్రభుత్వం రూ. 32 ఎక్స్​జ్​ సుంకాన్ని విధించింది. ఇప్పుడు అది లీటర్​కు 75 డాలర్లుగా ఉన్నా.. అదే సుంకాన్ని విధిస్తోంది" అని పూరీ తెలిపారు.

ఇదీ చూడండి:-Petrol Price today: స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

ABOUT THE AUTHOR

...view details