తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కమ్మని విందులు పంచే 'కనుమ' - మీ ఆప్తులకు ఈ స్పెషల్ కోట్స్​, గ్రీటింగ్స్​తో శుభాకాంక్షలు చెప్పండి! - Happy Kanuma 2024

Kanuma 2024 Wishes in Telugu : సంక్రాంతి వేడుకల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు కనుమను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే మీరు కూడా మీ బంధుమిత్రులకు ప్రతిసారిలా కాకుండా సరికొత్తగా కనుమ శుభాకాంక్షలు తెలియజేయండి. అందుకోసం 'ఈటీవీ - భారత్' స్పెషల్ విషెస్, కోట్స్ అందిస్తోంది. ఓసారి వాటిపై లుక్కేయండి!

Kanuma
Kanuma

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 1:27 PM IST

Updated : Jan 16, 2024, 6:01 AM IST

Happy Kanuma 2024 Telugu Wishes :తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. బంధుమిత్రుల రాకతో పల్లెల్లన్నీ పండగ శోభను సంతరించుకున్నాయి. ఇక ఈ మూడురోజుల పెద్ద పండగలో భాగంగా మూడో రోజు కనుమను ఘనంగా జరుపుకుంటున్నారు. నిజానికి సంక్రాంతి అనేది రైతుల పండగ. అందుకే వ్యవసాయదారులు, రైతులు, పాడి పశువులు ఉన్న వారందరూ కనుమనాడు పంటలు చేతికి అందించడంలో తమకు సాయపడిన పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. కాబట్టి దీనిని పశువుల పండగగా కూడా చెబుతారు.

ఏడాది కాలంగా తమకు చేదోడుగా ఉంటూ కష్టపడి పనిచేసిన ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా వాటిని ఆరాధించి ప్రేమగా చూసుకుంటారు. అందుకే కనుమను పశుపక్షాదులకు అంకితం ఇస్తారు. అదే విధంగా పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే కనుమ రోజు ఇంటి గుమ్మానికి పక్షుల కోసమే అన్నట్లుగా ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ముఖ్యంగా ఆంధ్రా, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

Kanuma 2024 Telugu Wishes :ఇక కనుమ పండగకు ఉన్న మరో విశిష్టత ఏమిటంటే.. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి ఈ రోజున విందు భోజనాలు చేస్తారు. ముఖ్యంగా ఇంటికి వచ్చిన అల్లుళ్లకు నాన్​వెజ్ వంటలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేస్తారు. మరి, మీరు కూడా ఈ కనుమ రోజు ఆనందంగా విందుల వేడుకలు చేసుకోండి. అలాగే మీ ఆత్మీయులు, బంధుమిత్రులకు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి సరికొత్తగా వారికి కనుమ శుభాకాంక్షలు తెలియజేయండి. అందుకోసం మీకు "ఈటీవీ భారత్" అదిరిపోయే కనుమ శుభాకాంక్షలు తెలిపే గ్రీటింగ్స్, స్పెషల్ కోట్స్ అందిస్తోంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే చూడండి.

Happy Kanuma 2024 Special Wishes in Telugu :

  • 'కనుమలోని కమనీయం.. మీ జీవితాన్ని రమణీయంగా మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!'
  • 'మిత్రులకు, ఆత్మీయులకు, నా ప్రియమైన వారందరికీ.. హ్యాపీ కనుమ'
  • 'ఈ కనుమ మీ కష్టాలన్నింటినీ తొలగించి.. సుఖ సంతోషాలు, సిరిసంపదలు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ ప్రియమైన వారికి కనుమ శుభాకాంక్షలు!'
  • 'కమ్మని విందుల కనుమ.. కలకాలం మీ బంధాలను నిలిపి ఉంచాలి.. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. కనుమ పండగ శుభాకాంక్షలు!!'
  • 'ఈ కనుమ పండగని మీ కుటుంబ సభ్యులంతా కలిసి గొప్పగా జరుపుకోవాలని.. ఈ సంక్రాంతి వేడుకలు ఏడాదికి సరిపోయే మధుర జ్ఞాపకాలు మిగిల్చాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.. కనుమ శుభాకాంక్షలు!'
  • 'మీ ఇల్లు ధాన్యరాశులతో నిండుగా.. పాడి పంట‌ల‌తో పచ్చగా.. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!!'
  • 'ఈ కనుమ పండగ మీ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని, ఆనందాన్ని తీసుకురావాలి.. హ్యాపీ కనుమ!'
  • 'ఈ సంక్రాంతి పండగ ఆనందాలు ఎప్పటికీ నిలవాలని కోరుకుంటూ.." అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..!!
  • 'మూడు రోజుల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం.. బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం.." అందరికీ కనుమ శుభాకాంక్షలు!'
  • 'ఈ పండుగ మీకు కొత్త ఆరంభాలు, అవకాశాలను తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ కనుమ!'

సంబరాలు తెచ్చే సంక్రాంతి - ఈ స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్​తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండిలా!

Kanuma Special Quotes in Telugu :

'మట్టిలో పుట్టిన మేలిమి బంగారం..

కష్టం చేతికి అంది వచ్చే తరుణం..

నేలతల్లి, పాడి పశువులు అందించిన వర ప్రసాదం..

'కనుమ' లా వడ్డించింది పరమాన్నం.'- అందరికీ కనుమ శుభాకాంక్షలు!

''రోకల్లు దంచే ధాన్యాలు..

మనసుల్ని నింపే మాన్యాలు..

రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు..

మళ్లీ మళ్లీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు.."- హ్యాపీ కనుమ!

"కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ..

శ్రమించిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ..

మనలోని మంచితనాన్ని వెలిగించే రోజు కనుమ...

అందరూ కలిసి కష్టసుఖాలను పంచుకునే పండగ కనుమ.." - మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!

'రైతులే రాజుగా, రాతలే మార్చే పండగ..

పంట చేలు కోతలతో ఇచ్చే కానుక..

మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ..

ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక..' - అందరికీ కనుమ శుభాకాంక్షలు!

"మూన్నాళ్ల సంబరం.. ఏడాదంతా జ్ఞాపకం.

స్వరం నిండిన సంగీతాల సంతోషాలు మనసొంతం.

ఈ రోజు, ఊరించే విందుతో పసందైన వేడుక చేసుకుందాం..!" - మీకు, మీ ప్రియమైన వారికి కనుమ శుభాకాంక్షలు.

మకర సంక్రాంతి- సూర్యునికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి? ప్రయోజనాలు ఏంటి?

సంక్రాంతికి నాటుకోడి పులుసు ఇలా ట్రై చేస్తే - ఇంటికి వచ్చిన వారంతా లొట్టులేసుకుంటూ తినాల్సిందే!

Last Updated : Jan 16, 2024, 6:01 AM IST

ABOUT THE AUTHOR

...view details