తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Happy Dasara 2023 : దసరా స్పెషల్ గ్రీటింగ్స్.. కోట్స్.. మీవారికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి! - దసరా శుభాకాంక్షలు 2023

Happy Dasara 2023 Special Wishes and Quotes : "పండగ" అంటేనే.. బంధుమిత్రుల కలయిక. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఒక్కచోటికి చేరడం. కానీ.. పలు కారణాలతో అందరూ రాలేకపోవచ్చు. అలాంటి వారికి నిండైన హృదయంతో.. ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేయండి. వారి ముఖాల్లో ఆనందాన్ని వీక్షించండి. ఇందుకోసమే.. మీకోసం స్పెషల్ విషెస్ ఇంకా కోట్స్ తీసుకొచ్చాం. ఇవి చదివి.. మీకు నచ్చిన కోట్స్​తో శుభాకాంక్షలు పంపించండి.

Vijayadasami Special Wishes and Quotes
Happy Dasara 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 10:02 AM IST

Happy Dasara 2023 Special Wishes and Quotes : దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు దుర్గామాతను నిష్ఠతో పూజించారు. కఠిన ఉపవాస దీక్షలు సైతం చేశారు. పవిత్రమైన మనస్సుతో అమ్మవారిని కొలిచారు. ఇలా.. శరన్నవరాత్రి ఉత్సవాలను ముగించి.. దసరా ఉత్సవాలకు తెరతీశారు. విజయదశమి పండగను తెలుగు రాష్ట్రాల్లో.. ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మన వారికీ, మనకు అందుబాటులో లేనివారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపండి. ప్రేమ, ఆప్యాయతలను పంచుకోండి.

విజయదశమి స్పెషల్ గ్రీటింగ్స్, కోట్స్ (Dasara Special Greetings and Quotes )

Dasara Special Wishes and Quotes

దుర్గా మాత మీపై ఆశీస్సులు కురిపిస్తుంది. ఈ విజయ దశమి నుంచి మీ జీవితంలో అన్నీ విజయాలే చేకూరాలని ఆశిస్తూ.. దసరా శుభాకాంక్షలు!

Dasara Special Wishes and Quotes

ఈ విజయదశమి వేళ రావణుడి దిష్టిబొమ్మ దహనం అయినట్టే.. మీలోని చింతలు, కష్టాలన్నీ కాలిబూడిదై పోవాలని కోరుకుంటూ.. విజయదశమి శుభాకాంక్షలు

Dasara Special Wishes and Quotes

నిజం ఎప్పుడూ గెలుస్తుంది. చెడుపై మంచి విజయం సాధిస్తుంది. ఆ దుర్గామాత మీకు ఎల్లప్పుడూ అండగానే ఉంటుంది.

Dasara Special Wishes and Quotes

మనిషిలోని రాక్షసుడు ఎల్లప్పుడూ ఓడిపోవాలి.. దేవీమాత ఎల్లప్పుడూ మనుషులకు మంచి బుద్ధిని ప్రసాదించాలి.

Dasara Special Wishes and Quotes

మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని.. ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

Dasara Vahana Pooja 2023 : దసరా రోజున.. మీ వాహనానికి పూజ.. ఎలా చేస్తున్నారు..?

Dasara Special Wishes and Quotes

సానుకూలమైన, సంతోషకరమైన ఆలోచనలు మాత్రమే మీ మనసున నిండిపోవాలి. ప్రతికూలతలన్నీ రావణుడి దిష్టిబొమ్మలా దహనమైపోవాలి.

Dasara Special Wishes and Quotes

ఈ విజయదశమి ఉత్సవం మీ ఇంటికి అవకాశాల సముద్రాన్ని తెస్తుంది. మీ ఇంట ఆనంద కెరటాలు పరవళ్లు తొక్కుతాయి.

Dasara Special Wishes and Quotes

ఈ దసరా దీపపు వెలుగులు మీలోని చీకట్లను కాల్చివేస్తుంది. చిరు నవ్వుల వెలుగులతో మీ జీవితం నిత్యనూతంగా ప్రకాశిస్తుంది.

Dasara Special Wishes and Quotes

దృఢ సంకల్పం, అంకితభావంతో రాముడు రావణుడిపై విజయం సాధించాడు. ఆయన మార్గాన్ని అనుసరించడం ద్వారా మీరు కూడా మీ భయాన్ని జయించండి.

Dasara Special Wishes and Quotes

"మనం ధర్మ బద్ధంగా జీవిస్తే.. అది మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. చివరకు విజయం తథ్యమని దసరా బోధిస్తోంది!"

Dasara Special Wishes and Quotes

"చెడు ఎప్పటికీ శాశ్వతం కాదు. ప్రేమ, నిజం మాత్రమే శాశ్వతం"

Dasara Special Wishes and Quotes

"ఈ ప్రపంచంలో చీకటి అనే చెడు ఉందన్నది నిజం.. దాన్ని చీల్చి చెండాడే వెలుగు తప్పక వస్తుందన్నది సత్యం!"

Dasara Special Wishes and Quotes

"ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు.. ఆ భయాన్ని జయించడం"

Dasara Special Wishes and Quotes

"ఇప్పటి దాకా జరిగింది గతం. ఇక ముందున్నది మన భవిష్యత్తు. ఈ పండగ వెలుగుల నుంచి స్పూర్తి పొందండి. జీవితం మీకు చాలా ఆనందాన్ని తెస్తుంది. మిమ్మల్ని మీరు నమ్మండి."

Dasara Special Non Veg Recipes : దసరాకి మటన్​ కర్రీ ఇలా ట్రై చేయండి.. వావ్ అనాల్సిందే..!

Navratri Special Mehndi designs : నవరాత్రి మెహందీ.. ఈ అద్భుతమైన డిజైన్లు మీకోసం!

ABOUT THE AUTHOR

...view details