సీఎస్ఐఆర్- నేషనల్ ఎయిరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఓ కొత్త తరం ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన 'హన్స' ఎయిర్‌క్రాఫ్ట్ (Nal hansa) బెంగళూరులోని హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్‌కు చెందిన ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. 80 నాట్ల (148 కిలోమీటర్లు) వేగంతో అత్యధికంగా 4000 అడుగుల ఎత్తులో ఈ విమానం ప్రయాణించింది. కెప్టన్ అమిత్ దాహియా.. ఈ విమానానికి టెస్ట్ పైలట్‌గా వ్యవహరించారు.
డీజీసీఏ, సీఈఎంఐఎల్ఏసీ, సీఎస్ఐఆర్-ఎన్ఏఎల్ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులు, శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. హన్స-ఎన్జీ విమాన ప్రయోగం ఎన్ఏఎల్కు మైలురాయిగా నిలవనుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సీ మాండే పేర్కొన్నారు. ఈ విమానాల తయారీలో భాగస్వామ్యం కోసం ఇప్పటికే ఓ ప్రైవేటు సంస్థను సంప్రదించామని.. త్వరలోనే తయారీ ప్రారంభం అవుతుందని తెలిపారు.