Hanamkonda Road Accident Today : నిత్య జీవితంలో ఎప్పుడూ ఏ ప్రమాదం ముంచుకువస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి. మనం మంచిగానే వాహనం నడుపుతున్నా, ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం. ఎంత జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా, కొన్ని సార్లు ఇతరులు చేసినా తప్పులకు ఎందరో అమాయకులు బలవుతున్నారు.
Adilabad Lorry Accident Viral Video : కంటైనర్ బీభత్సం.. లారీ.. బైక్.. ఆటో.. ఆగేదే లే అన్నట్లుగా..
తాజాగా హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Hanamkonda Road Accident)చోటుచేసుకుంది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈరోజు తెల్లవారుజామున కారును, లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
"మా పెద్దమ్మ వాళ్లు దేవుని దర్శనం కోసం వేములవాడ వెళ్తున్నారు. ఇంతలోనే ఇలా జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ముగ్గురు గాయపడ్డారు. మా పెద్దమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తమ్ముడు, చెల్లె పరిస్థితి బాగానే ఉంది." - మృతుల బంధువులు
Road accident in Elkathurthi Today : కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు, పోలీసులు, స్ధానికులు తీవ్రంగా శ్రమించారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులంతా మలుగు జిల్లా ఏటూరునాగారం వాసులని పోలీసులు తెలిపారు. వరుసకు అన్నదమ్ముల కుటుంబాలకు చెందిన ఏడుగురు, ఏటూరునాగారం నుంచి వేములవాడకు దైవదర్శనానికి కారులో వెళ్తుండంగా ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.