తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విరాళాల సేకరణలో తెరాస ఫస్ట్​.. టీడీపీ సెకండ్​ - ఎలక్టోరల్​ బాండ్లు

ప్రాంతీయ పార్టీలు సేకరించిన విరాళాల వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఈ జాబితాలో రూ.89కోట్లతో తెరాస మొదటిస్థానంలో నిలవగా.. రూ.81కోట్లతో తెదేపా రెండోస్థానంలో నిలిచింది.

Regional parties
ప్రాంతీయ పార్టీలు

By

Published : Nov 11, 2021, 10:46 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలు గుర్తు తెలియని వర్గాల నుంచి 445 కోట్ల 77లక్షల రూపాయల విరాళాలను సేకరించినట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ ఏడీఆర్ వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల మొత్తం విరాళాల్లో ఇది 55శాతం కంటే ఎక్కువ అని తెలిపింది. గుర్తు తెలియని వర్గాల నుంచి ఆ పార్టీలకు అందిన విరాళాల్లో 95శాతం ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో వచ్చినట్లు వివరించింది. రూ.నాలుగు కోట్లు స్వచ్ఛంద విరాళాల ద్వారా ప్రాంతీయ పార్టీలు సేకరించినట్లు ఏడీఆర్ వెల్లడించింది.

గుర్తు తెలియని వర్గాల నుంచి సేకరించిన విరాళాల్లో రూ.89 కోట్లతో తెరాస మొదటి స్ధానంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ రూ.81కోట్లతో రెండో స్ధానంలో, రూ.74 కోట్లతో వైకాపా మూడో స్ధానంలో నిలిచాయి.

రూ.20వేల కంటే తక్కువ విరాళాల వివరాలను రాజకీయ పార్టీలు బయటకు వెల్లడించాల్సిన అవసరం లేదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details