గుజరాత్లో ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. కొందరు దొంగలు కలిసి రెండు బస్తాల వెంట్రుకలను చోరీ చేశారు. ఈ వెంట్రుకల బరువు 40 కిలోలు ఉంటుందని.. వాటి ధర దాదాపు రూ.2 లక్షలని పోలీసులు తెలిపారు. వెంట్రుకలు చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే వారి నుంచి రెండు బస్తాల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజ్‌కోట్.. పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్ అనే వ్యాపారి రెండు బస్తాల వెంట్రుకలతో బైక్‌పై మోర్బీకి వెళ్తున్నాడు. ఆ రెండు బస్తాల్లో దాదాపు 40 కిలోల బరువున్న వెంట్రుకలు ఉన్నాయి. అయితే ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి పుష్పేంద్ర సింగ్ ఉన్న వెంట్రుకల బస్తాలను దోచుకెళ్లారు. వారికి మరో ఇద్దరు సహకరించారు. వెంటనే పుష్పేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ చోరీపై కేసు నమోదు పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. రాజ్‌కోట్ సమీపంలోని పిప్లియా గ్రామంలో వెంట్రుకల బస్తాలను చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వెంట్రుకల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
"నిందుతులను రోహిత్, లాల్జీ చౌహాన్, రవి, రాహుల్, పురుసోత్తం భాయ్ అనే ఐదుగురు వ్యక్తులను వెంట్రుకల చోరీకి సంబంధించి అరెస్ట్ చేశాం. వారి నుంచి రెండు బస్తాల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నాం. నిందితులను రాజ్‌కోట్ సమీపంలోని పిప్లియాలో పట్టుకున్నాం. నిందితులు చోరికి పాల్పడిన వెంట్రుకల విలువ దాదాపు రూ. 2లక్షలు ఉంటుంది. నిందితులకు నేర చరిత్ర ఉంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నాం."
-గాంధీగ్రామ్ పోలీసులు
దుండగులు దొంగిలించిన వెంట్రుకలు దుండగులు దొంగిలించిన వెంట్రుకలు పలు అనారోగ్య సమస్యలు, కాలుష్యం వల్ల కొందరు మహిళల జట్టు ఊడిపోతుంది. ఆ వెంట్రుకలను గ్రామాలు, పట్టణాల్లోకి వెళ్లి వీధి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. మహిళలు జుట్టు ఇస్తే వారికి స్టీలు పాత్రలు లేదా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తారు. వాటిని కంపెనీలు కొనుగోలు చేసి విగ్గులు తయారు చేస్తాయి. ఆ విగ్గులను క్యాన్సర్ రోగులు, బట్టతల ఉన్నవారికి అమ్ముతారు. వెంట్రుకలకు డిమాండ్ అధికంగా ఉన్నందున.. దొంగలు సైతం వాటిపై దృష్టిసారించారు.
సెల్ టవర్ చోరీ..
బిహార్‌లో మొబైల్ టవర్‌ను చోరీ చేశారు దొంగలు. టవర్ సంస్థ ప్రతినిధులమంటూ చట్టుపక్కల వారిని నమ్మించి దాన్ని చోరీ చేశారు. టవర్ మొత్తాన్ని భాగాలుగా విడగొట్టి వాహనంలో తీసుకెళ్లారు. దాంతో పాటు జనరేటర్, స్టెబిలైజర్, మిగతా వస్తువులు సైతం ఎత్తుకెళ్లారు. దొంగలు చేసిన ఈ పనికి ఆశ్చర్యం వ్యక్తంచేసిన మొబైల్ టవర్ ప్రతినిధులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ చోరీ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగింది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.