కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హాఫ్కిన్ బయోఫార్మా కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్బీపీసీఎల్) సంస్థ సిద్ధమైంది. అవసరమైన ఏర్పాట్లు పూర్తవ్వగానే ఉత్పత్తి ప్రారంభిస్తామని.. అందుకు ఎనిమిది నెలలు పడుతుందని సంస్థ వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏడాదికి 22 కోట్ల డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించి ఇటీవల హెచ్బీపీసీఎల్కు అనుమతి కూడా లభించింది.
"భారత్ బయోటెక్ నుంచి టెక్నాలజీ ట్రాన్సఫర్ ప్రక్రియ త్వరలోనే పూర్తి కానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నాం. ఉత్పత్తికి తగిన ఏర్పాట్లు పూర్తికావడానికి 8 నెలలు పడుతుంది. ఉత్పత్తి ప్రారంభమయితే నెలకు దాదాపు 2 కోట్ల డోసులను అందుబాటులోకి తెస్తాం."