తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ సమక్షంలోనే నన్ను అవమానించారు: మమత - బంగాల్​ ఎన్నికలు 2021

ప్రధాని మోదీ సమక్షంలోనే తనను అవమానించారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ వంటి మహానుభావులతో పాటు మొత్తం బంగాల్​నే భాజపా అవమానించిందని మండిపడ్డారు. భాజపా తన పేరును 'భారత్​ జలావ్​ పార్టీ'గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

Had to face taunts, insult in presence of PM Modi at Victoria Memorial event: Mamata Banerjee
మోదీ సమక్షంలోనే నన్ను అవమానించారు: మమత

By

Published : Jan 25, 2021, 3:24 PM IST

బంగాల్​కు చెందిన మహానుభావులను భాజపా అవమానపరుస్తోందని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీగా ఉన్న పేరును 'భారత్​ జలావ్​ పార్టీ' (దేశాన్ని నాశనం చేసే పార్టీ)గా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు.

హుగ్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మమత. ఈ నేపథ్యంలో నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ జయంతి నాడు తనను భాజపా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

"నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ అందరి నేత. కానీ వాళ్లు(భాజపా).. ప్రధాని సమక్షంలోనే నన్ను అవమానించారు. నేను తుపాకులను నమ్మను. రాజకీయాలను విశ్వసిస్తాను. భాజపా నేతాజీతో పాటు బంగాల్​ను కూడా అవమానించింది."

--- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

విక్టోరియా మెమోరియల్​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు, మమత కూడా పాల్గొన్నారు. ఆమె ప్రసంగించేందుకు వెళుతున్న సమయంలో కొందరు మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 'జై శ్రీరామ్​' నినాదాలు కూడా వినపడ్డాయి. 'అతిథులతో ప్రవర్తించే తీరు ఇదేనా?' అని ప్రశ్నిస్తూ.. తనకు జరిగిన దానికి నిరసనగా మమతప్రసంగించకుండా వెనుదిరిగారు.

'త్వరగా వెళ్లిపోండి..'

ఇటీవలి కాలంలో తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. దీనిపై స్పందించిన మమత.. పార్టీని వీడాలి అనుకునేవారు త్వరగా వెళ్లిపోవాలని పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్​​ దేనికీ భయపడదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టికెట్​ ఇవ్వమని తెలిసే వారందరూ వీడుతున్నారని అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:-బంగాల్​ బరి: అలజడుల నందిగ్రామ్​లో గెలుపెవరిది?

ABOUT THE AUTHOR

...view details