తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సర్కారు పనిచేసుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు' - రాహుల్ గాంధీ విదేశీ విరాళాలు

విదేశాలు అందిస్తున్న సాయాన్ని పొందుతూ కేంద్రం గొప్పగా భావించడం బాధాకరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.

rahul on foreign aid
రాహుల్ కేంద్రం విదేశీ సాయం

By

Published : May 10, 2021, 11:55 AM IST

కరోనా సమయంలో కేంద్రం తన బాధ్యతలను సరిగా నిర్వర్తించి ఉంటే విదేశాల నుంచి భారత్‌ సాయం పొందే అవసరం వచ్చేది కాదని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. విదేశాల నుంచి సాయం పొందుతూ కూడా కేంద్రం తన చర్యలను సమర్థించుకోవడం బాధాకరమని ట్వీట్‌ చేశారు.

"విదేశాల సాయం తీసుకోవడాన్ని భారత ప్రభుత్వం పదేపదే గొప్పగా చెప్పుకోవడం బాధాకరం. ప్రభుత్వం తన బాధ్యతను సరిగా నిర్వర్తించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

వివిధ దేశాల నుంచి అందుతున్న సాయంపై కేంద్రం పారదర్శకత పాటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన సహాయక సామగ్రి వివరాలను వెల్లడించాలని కోరుతోంది.

కరోనాపై పోరు సాగిస్తున్న భారత్​కు వివిధ దేశాల నుంచి విశేష సాయం లభిస్తోంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, ఐర్లాండ్, రొమేనియా, సింగపూర్, స్వీడన్, కువైట్ దేశాలు వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని పంపించాయి.

ఇదీ చదవండి:బ్లాక్​ ఫంగస్​పై జాగ్రత్త సుమా!

ABOUT THE AUTHOR

...view details