ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ అధికారిక వెబ్సైట్.. హ్యాక్ అయింది. 2022లో శాసనసభ ఎన్నికలు (UP Election 2022) జరగనున్న వేళ.. ఈ హ్యాకింగ్ జరగడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. అందులో అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేశారు. బుధవారం ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్తర్‌ప్రదేశ్ డెవలప్మెంట్ సిస్టమ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీఈఎస్సీఓ).. లఖ్‌నవూలోని సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీనిపై.. ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకొని.. కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు సైబర్ క్రైం ఏడీజీ రామ్ కుమార్.
''www.upvidhansabhaproceedings.gov.in అనే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ సచివాలయం అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయింది. ఇంకా ఆ వెబ్సైట్లో అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు.''
- రామశంకర్ సింగ్, యూపీ డీఈఎస్సీఓ అసిస్టెంట్ మేనేజర్