తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో దారుణం.. జిమ్​ ఓనర్​ హత్య.. దొరక్కండా ఉండేందుకు CCTV బాక్స్​ను.. - delhi gym owner killed

ఓ జిమ్​ నిర్వాహకుడిని గుర్తు తెలియని వ్యక్తులు.. వరుస కాల్పులు జరిపి హత్య చేశారు. అనంతరం వారు దొరక్కకుండా ఉండేందుకు జిమ్​లో ఉన్న సీసీటీవీ డీవీఆర్​ బాక్స్​ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. దిల్లీలో జరిగిందీ ఘటన.

Etv Bharatcrime news
Etv Bharatcrime news

By

Published : Dec 31, 2022, 12:57 PM IST

Updated : Dec 31, 2022, 2:42 PM IST

దేశ రాజధాని దిల్లీలో దారుణం జరిగింది. ఓ జిమ్​ నిర్వాహకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. మృతి చెందిన వ్యక్తిని మహేంద్ర అగర్వాల్​గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తూర్పు దిల్లీలోని ప్రీత్ విహార్​ ప్రాంతంలో మహేంద్ర అగర్వాల్​ అనే వ్యక్తి.. ఎనర్జీ జిమ్​ అండ్​ స్పా పేరుతో జిమ్​ నిర్వహిస్తున్నాడు. దాంతో పాటు జిమ్ పరికరాల వ్యాపారం కూడా చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మహేంద్ర అగర్వాల్​.. తన కార్యాలయంలో ఉన్నాడు.

అదే సమయంలో ముగ్గురు దుండగులు.. అతడి కార్యాలయంలోకి చొరబడ్డారు. మహేంద్ర అగర్వాల్​పై కాల్పులు జరిపారు. తలకు బుల్లెట్ తగిలి మహేంద్ర అక్కిడకక్కడే మృతి చెందాడు. అనంతరం దుండగులు.. సీసీటీవీ డీవీఆర్​ను కూడా ఎత్తుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ప్రియుడితో కలిసి భర్త హత్య..
ఉత్తర్​ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి ఓ భార్య.. తన భర్తను హత్య చేసింది. అనంతరం తన ఇంటి పరిసరాల్లోని భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.
పోలీసుల కథనం ప్రకారం..నిఘాసన్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో నివాసం ఉంటున్నాడు బాధితుడు బన్వారీ. అతడి భార్య జూలీ.. అదే ప్రాంతానికి చెందిన సంతోశ్​తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో జూలీ, బన్వారీ మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది.

తమ ప్రేమకు భర్త అడ్డుగా మారుతున్నాడని జూలీ భావించింది. ప్రియుడితో కలిసి బన్వారీని దారుణ హత్య చేసింది. అనంతరం ఇంటి పరిసరాల్లోనే మృతదేహం పాతిపెట్టింది. సమచారం అందుకున్న పోలీసులు జూలీ, సంతోశ్​ను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ నేరాన్ని ఇద్దరూ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

చేయని తప్పుకు ఏడేళ్ల జైలు శిక్ష!
ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన ఓ యువకుడు.. ఎలాంటి నేరం చేయకుండా ఏడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. పోలీసుల తప్పుడు విచారణే అందుకు కారణం. అసలేం జరిగిందంటే?
మానవ హక్కుల కార్యకర్త రాధాకాంత్ త్రిపాఠి వివరాల ప్రకారం..
2015 ఫిబ్రవరి 17వ తేదీన అలీగఢ్ జిల్లాలోని ధంథోలి గ్రామానికి చెందిన ఒక రైతు.. తన 17 ఏళ్ల కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి విష్ణును బాలిక తండ్రి అనుమానించాడు. దీంతో పోలీసులు కిడ్నాప్ సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదు చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత ఓ బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ధంథోలి గ్రామానికి చెందిన రైతు.. ఆ మృతదేహం తన కూతురిదేనని తెలిపాడు. దీంతో పోలీసులు విష్ణును అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఇటీవలే రైతు కుమార్తె బతికే ఉందని తేలింది. దీంతో పోలీసుల తప్పుడు విచారణకు బలైన అమాయక యువకుడి ఏడేళ్ల జీవిత కాలాన్ని తిరిగి ఇచ్చేదెవరు అని రాధాకాంత్ ప్రశ్నించారు. అందుకు పరిహారం చెల్లించాలని ఆదేశించారు. నాలుగు వారాల్లోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్‌.. యూపీ డీజీపీని ఆదేశాలు జారీ చేశారు.

మైనర్​పై గ్యాంగ్​ రేప్​.. ట్యూబ్​వెల్​లో..
ఉత్తర్​ప్రదేశ్​లోని మౌ జిల్లాలో ఓ మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. అనంతరం ఆమె చేతులు, కాళ్లు కట్టి.. స్థానికంగా ఉన్న గొట్టపు బావిలో పడేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Last Updated : Dec 31, 2022, 2:42 PM IST

ABOUT THE AUTHOR

...view details