Gyan vapi case: జ్ఞాన్‌వాపీ మసీదు, శృంగార్ గౌరీ ప్రాంగణంలో సర్వే చేపట్టాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశించిన సివిల్ జడ్డ్ జస్టిస్ రవికుమార్ దివాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సివిల్ కేసును కీలకమైన అంశంగా మారడం వల్ల భయానక వాతావరణం నెలకొందన్నారు. దీని వల్ల తన కుటుంబసభ్యుల భద్రతపై ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. సర్వేకు నియమితులైన అడ్వకేట్ కమిషనర్‌ను మార్చాలని దాఖలైన పిటిషన్‌పై గురువారం జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ పిటిషన్‌ను జస్టిస్ రవికుమార్ తిరస్కరించారు.
"ఈ కేసు కీలకంగా మారడం వల్ల భయానక వాతావరణం నెలకొంది. నేను నా కుటుంబం గురించి.. వాళ్లు నా గురించి ఆందోళన చెందే స్థాయికి ఈ పరిస్థితి చేరింది. నేను ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతిసారి నా భార్య నా గురించి కంగారు పడుతోంది. నిన్న నేను మా అమ్మతో మాట్లడినప్పుడు కూడా తను నా గురించి ఆందోళన చెందుతున్నట్లు కనిపించింది. నేను కూడా కమిషనర్‌గా సర్వేకు వెళ్లే అవకాశం ఉంటుందని మీడియా కథనాల ద్వారా ఆమె తెలుసుకుంది. నేను అక్కడికి వెళ్లకూడదని.. అది క్షేమం కాదని సూచించింది."
-జస్టిస్ రవి కుమార్ దివాకర్, సివిల్ జడ్జ్