దేశంలో రెండో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. వైద్య పరికరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌కు చెందిన కుష్వాహా.. ఆక్సిజన్ సిలిండర్‌ను నియంత్రించే సరసమైన ఆక్సి-ఫ్లో మీటర్‌ను అభివృద్ధి చేశాడు.
గ్వాలియర్‌కు చెందిన మోను కుష్వాహా.. ఆక్సిజన్ సిలిండర్ నియంత్రణ పరికరాన్ని కొనేందుకు ప్రయత్నించాడు. బహిరంగ మార్కెట్లో ఇది ఎక్కడా లభించకపోగా.. బ్లాక్ మార్కెట్లో మాత్రం రూ.7000 ఉన్నట్టు తెలిసింది. అంత సొమ్ము వెచ్చించేందుకు నిరాకరించిన ఆ యువకుడు.. తానే స్వయంగా ఆ పరికరాన్ని రూపొందించాడు.